Thursday, April 25, 2024

టెక్‌ దిగ్గజం గూగుల్‌తో ప్రభుత్వ ఒప్పందం.. డిజిటల్‌ తెలంగాణ దిశగా మరో ముందడుగు..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : డిజిటల్‌ తెలంగాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం తరపున మరో ముందడుగు పడిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు టెక్‌ దిగ్గజం గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ కొత్త ఒప్పందం ద్వారా యువత, మహిళలు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ లభించనుందన్నారు. పౌరసేవల్లో మార్పులు రానున్నాయని చెప్పారు. గూగుల్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యనందిస్తున్నట్లు తెలిపారు. టాస్క్‌ ద్వారా యువతకు డిమాండ్‌ ఉన్న రంగాల్లో గూగుల్‌తో కలిసి సర్టిఫికెట్‌ కోర్సులు అందించి స్కాలర్‌షిప్పులు కూడా ఇవ్వనున్నామన్నారు. అగ్రిటెక్‌లో గూగుల్‌ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందన్నారు. ప్రజారవాణా మరింత మెరుగయ్యేందుకుగాను గూగుల్‌ మ్యాప్‌ సేవలను కంపెనీ మరింత విస్తరించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఒప్పందంలో భాగంగా వీ హబ్‌తో కలిసి వుమెన్‌ పేరుతో మహిళలను నానో, మైక్రో వ్యాపార రంగాల్లో రాణించేందుకు కావాల్సిన సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఈ ఎంవోయూలో భాగంగా గూగుల సంస్థ కొలాబరేటివ్‌ టూల్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థలకు డిజిటల్‌ విద్యనందించనుందన్నారు. గూగుల్‌ కెరీర్‌ ద్వారా అర్హులైన యువతకు ఐటీ సపోర్ట్‌, ఐటీ ఆటోమేషన్‌, యూఎక్స్‌ డిజైన్‌, డేటా అనలిటిక్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వాటిలో సర్టిఫిక్‌ కోర్సులతో పాటు స్కాలర్‌షిప్‌లు అందించనున్నామన్నారు. ఈ ఒప్పందం కార్యక్రమంలో గూగుల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

గూగుల్‌ రెండో పెద్ద క్యాంపస్‌కు శంకుస్థాపన … కేటీఆర్‌ ట్వీట్‌

అమెరికాలోని మౌంటెన్‌ వ్యూలో ప్రధాన కార్యాలయం తర్వాత టెక్‌ దిగ్గజం గూగుల్‌ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో నిర్మించతలబెట్టింది. గూగుల్‌ ఈ రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు గురువారం శంకుస్థాపన చేసినట్లు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో 7.3 ఎకరాల్లో పర్యావరణ హితంగా ఈ కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement