Sunday, April 14, 2024

సీసీఐ జరిమానాతో వెకక్కి తగ్గిన గూగుల్‌

గూగుల్‌ ప్లే స్టోర్‌ విధానాల్లోనూ, అండ్రాయిడ్‌ విషయంలోనూ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) రెండు సార్లు భారీ జరిమానా విధించింది. సీసీఐ ఆదేశాల మేరకు గూగుల్‌ ప్లే స్టోర్‌ విధానాల్లో మార్పులు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత్‌లో వినియోగదారుల లావాదేవీలకు కావాల్సిన డిజిటల్‌ వస్తువులు, సేవల కొనుగోలు కోసం డెవలపర్లు పే బిల్లింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించాలన్న తప్పనిసరి నిబంధనను గూగుల్‌ నిలిపివేసింది. సీసీఐ తీర్పుపై న్యాయ సమీక్ష కోరేందుకు ఉన్న ప్రత్యామాయాలను కూడా పరిశీలిస్తున్నామని గూగుల్‌ తెలిపింది.

ప్టే స్టోర్‌ విధానాల్లో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతుందని సీసీఐ ఇటీవల గూగుల్‌పై 936.44 కోట్ల భారీ జరిమానాను విధించింది. వీటి నిరో ధానికి చర్యలు చేపట్టాల్సిందిగా, నిర్ధేశిత సమయంలోగా తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా సీసీఐ ఆదేశించింది. అండ్రాయిడ్‌ మొబైల్‌ వ్యవస్థలో యాప్‌ డెవలపర్లకు గూగుల్‌ ప్లేస్టోర్‌ కీలక సరఫరా ఛానెల్‌గా వ్యవహరిస్తోంది. మార్కెట్‌కు వచ్చే యాప్‌పై యాజమానులకు నియంత్రణ ఇస్తోంది. జరిమానాతో పాటు థర్ట్‌ పార్టీ బిల్లింగ్‌, యాప్‌ల కొనుగోలుకు చెల్లింపు సేవలను వినియోగించుకోకుండా యూప్‌ డెవలపర్లను అడ్డుకోరాదని సీసీఐ గూగుల్‌ను ఆదేశించింది. ఆర్థిక వివరాలు, ఇతర పత్రాలను అందించడానికి గూగుల్‌కు 30 రోజుల సమయం ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement