Friday, April 19, 2024

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న గూగుల్ డూడుల్

గూగుల్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గురువారం ప్రపంచ ధ‌రిత్రి దినోత్స‌వం సంద‌ర్భంగా సృజనాత్మక డూడుల్‌‌‌తో ప్రజలను ఆలోచింపచేసింది. మాన‌వ మ‌నుగ‌డ‌కు చెట్లను నాటడం అన్న‌ ప్రాధాన్య‌త‌ను హైలైట్ చేసింది. ఒక వృద్ధురాలు చెట్టు కింద ఒక పుస్తకం చదువుతుండగా.. ఆమె మనుమరాలు ఒక మొక్క‌ను నాటింది. అలా అలా వారి త‌ర్వాతి త‌రాల‌తో మొక్క‌ల‌ను నాటిస్తూ వారు నివ‌సించే చోటు ప‌చ్చ‌గా ఉండేలా చేసుకున్నారు. మ‌నమూ అలాగే చేద్దాం.. ప‌చ్చ‌గా ఉందాం.. అనే నినాదంతో గూగుల్ డూడుల్ అర్థ‌వంతంగా ఉంది. ఈ వీడియోలో, సహజమైన ఆవాసాలలో వివిధ రకాల చెట్లను నాటారు. భవిష్యత్ తరాల కోసం మన భూమిని ఆరోగ్యంగా ఉంచడానికి మన వంతు కృషి చేయాలని, సాంప్రదాయాన్ని యువతరానికి అందించేలా విలువైన జీవిత పాఠం నేర్పించాలనే వంటి అంశాల‌ను డూడుల్ బహిర్గతం చేసింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement