Thursday, April 25, 2024

వరుసగా ఐదో రోజు తగ్గిన బంగారం ధరలు..

బంగారం ధరలు ఈ మధ్య కాలంలో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్నాయి. ఒక రోజు తగ్గుతుంటే.. మరో రోజు పెరుగుతుంది. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఎప్పుడూ రేటు తగ్గుతుందా…? అంటూ ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అయితే మనదేశంలో బంగారం ధరలు వరుసగా ఐదో రోజూ తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుదల బాటలో నడుస్తుండటంతో..ఆ ప్రభావం మల్టీ కమోడిటీ ఎక్చేంజ్ పై పడింది. నిన్న నాడు అర శాతం వరకూ పడిపోయిన బంగారం ధర.. ఇవాళ మరో 0.3 శాతం తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 44,300కు తగ్గింది. ఇదే సమయంలో రెండు రోజుల వ్యవధిలో వెండి ధర 2.50 శాతానికి పైగా తగ్గడంతో కిలో వెండి రూ. 52,617కు దిగి వచ్చింది. 22 క్యారెట్ స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 640 రూపాయలు తగ్గి రూ. 43,630 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు మునుముందు మరింతగా పతనం కావచ్చని బులియన్ పండితులు అంచనా వేస్తున్నారు. చైనాలో పారిశ్రామికోత్పత్తి పెరగడం, అమెరికా ఆర్థిక శక్తి తిరిగి పుంజుకునేలా ట్రిలియన్ డాలర్ల విలువైన ప్రణాళికను బైడెన్ ప్రకటించడంతో బులియన్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించిందని..పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ వైపు వెళుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement