Friday, April 19, 2024

బంగారు రుణాలపై వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో ఎంత?

బంగారు రుణాలు 7 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో బంగారం బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం పాత కాలం నుంచి జరుగుతున్న తంతే. బంగారం విలువైన గ్యారంటీ తాకట్టు వస్తువు కాబట్టి రుణం కూడా వేగంగా మంజూరవుతుంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని తమ స్వాధీనంలో ఉంచుకోవడం బ్యాంకులకు చాలా సులభం కూడా. బంగారు రుణాలు మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫైనాన్సింగ్ సౌకర్యాలలో ఒకటి. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకునేటప్పుడు క్రెడిట్ స్కోర్ తక్కువున్నా ఇబ్బందేమీ లేదు. బంగారంతో రుణాల వడ్డీ.. పర్సనల్ లోన్ వడ్డీకంటే తక్కువే ఉంటుంది. బ్యాంకు ఖాతా ఉంటే బ్యాంకులు వేగంగా రుణం మంజూరు చేస్తాయి.

సాధారణంగా బంగారం మార్కెట్ విలువలో 75% మించని రుణ మొత్తాన్ని అందిస్తారు. బంగారు రుణాలకు బ్యాంక్‌కి, బ్యాంక్‌కి వడ్డీ రేట్లు మారుతుంటాయి. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్, పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు, ఆలస్యంగా చెల్లింపు ఛార్జీలు, రుణ ధరఖాస్తు సౌలభ్యం మొదలైన వాటి కోసం తనిఖీ చేసుకోవాలి.

దేశంలోని కొన్ని ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్) సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న బంగారు రుణాలపై అమలు చేసే వడ్డీ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏడాది కాలానికి రూ.లక్ష రుణానికి వడ్డీ రేట్లు (జూన్ 1నాటికి లభించిన డేటా ఆధారంగా)

Advertisement

తాజా వార్తలు

Advertisement