Friday, April 19, 2024

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.47వేల వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడి రూ. 270 తగ్గుదలతో రూ.51,270 వద్ద ఉంది. మరొకవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. గురువారం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి రూ.50,800 వద్ద ట్రేడయింది.

ఢిల్లిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150, ముంబైలో రూ. 47000, చెన్నైలో రూ. 47,540, హైదరాబాద్‌లో రూ.47,000గా ఉన్నాయి. వెండిధరలు హైదరాబాద్‌లో కిలో రూ.60 వేలు వద్ద కొనసాగుతున్నది. విజయవాడ, విశాఖ, చెన్నై, కేరళ నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతుండగా, ఢిల్లి, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో రూ.50,800 పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement