Wednesday, April 17, 2024

ఆస్తి పన్నుల్లో జీహెచ్‌ఎంసీ రికార్డ్‌.. భారీ వసూళ్లను రాబట్టిన సంస్థ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జీహెచ్‌ఎంసీ రూట్‌ మార్చింది. నిర్లక్ష్యాన్ని వదిలి టార్గెట్‌లను రీచ్‌ అయ్యేందుకు కృషి చేస్తోంది. ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డును సృష్టించింది. మునుపెన్నడూ లేనంత వసూళ్లను రాబట్టింది. టార్గెట్‌ కన్నా కొంచెం తక్కువ వసూళ్లు చేసినా.. గతంలో కంటే పని విధానాన్ని మెరుగు పరుచుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ ఏడాది 1681.52 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డును సృష్టించింది. 2022-23వ ఏడాదికి రూ. 2000 కోట్ల కలెక్షన్‌ చేయాలని ముందుగా నిర్ధేశించింది. అందులో కలెక్షన్‌ శాతం 84.09గా నమోదైంది. 2020-21వ ఆర్థిక ఏడాదిలో లక్ష్యం 1700 కోట్ల రూపాయలు కాగా, 1633.75 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు జరిగాయి. 2021-22వ ఏడాదిలో టార్గెట్‌ 1850 కోట్ల రూపాయలు కాగా, రూ.1495.29 కోట్లు మాత్రమే వచ్చాయి.

- Advertisement -

రాయితీ ప్రోత్సాహం సక్సెస్‌..

ఏటా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆస్తిపన్ను రాబట్టుకునేందుకు జీహెచ్‌ఎంసీ 5 శాతం రాయితీ ప్రకటిస్తుంది. దాని ద్వారా ముందస్తు ఆదాయం రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అవకాశాన్ని దాదాపు 40 శాతం మంది అంటే 8 లక్షల పై చిలుకు ఉపయోగించుకొని ఆస్తి పన్ను చెల్లించారు. నగరంలో 18.52 లక్షల మంది పన్ను చెల్లించాల్సి ఉండగా.. 13 లక్షలకు పైగా కట్టారు. అయితే ఆన్‌లైన్‌ ద్వారా అధికంగా చెల్లిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు సేవలను కొనసాగిస్తున్నారు.

జోన్ల వారీగా కలెక్షన్లు..

జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా వసూళ్లను ఖైరతాబాద్‌లో జరిగినట్లుగా అధికారులు తెలిపారు. అత్యల్పంగా చార్మినార్‌ జోన్‌లో నమోదయ్యాయి. ఖైరతాబాద్‌లో రూ.585 కోట్ల వసూళ్లు టార్గెట్‌ పెట్టుకోగా.. రూ.435.57 కోట్లు వసూల్‌ చేశారు. చార్మినార్‌ జోన్‌లో రూ.172 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. రూ. 122.86 కోట్లు మాత్రమే రాబట్టగలిగారు. తర్వాత శేరిలింగంపల్లిలో టార్గెట్‌ 393 కోట్ల రూపాయలు కాగా, రూ.348.60 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు జరిగాయి. ఇక కూకట్‌పల్లిలో 295 కోట్లకు గాను, 282.18 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement