Wednesday, April 24, 2024

ఈనెల 13 నుంచి 16 వరకు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌తో త్వరలో వినియోగదారుల ముందుకురాబోతోంది. ‘ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌’ పేరుతో నిర్వహించనున్న ఈ సేల్‌ ఈనెల 13 నుంచి 16 వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్‌ డివైజ్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలపై భారీ ఆఫర్లు, డీల్స్‌, డిస్కౌంట్లను అందించనుంది. ఎస్‌బీఐ కార్డు ద్వారా షాపింగ్‌ చేసే వినియోగదారులకు 10శాతం ఇన్‌స్టాంట్‌ తగ్గింపును అందిస్తుంది.

ఆఫర్ల విషయానికి వస్తే.. గూగుల్‌ పిక్సెల్‌ 4ఏ, ఐఫోన్‌ 11 ప్రొ, మోటోరోలా రేజర్‌ 5జీ, శాంసంగ గెలాక్సీ ఎఫ్‌ 12, ఆసుస్‌ ఆర్‌ఓజీ ఫోన్‌ 3 తదితర ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌కు జూన్‌ 12న అర్ధరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. సాధారణ కస్టమర్లకు జూన్‌ 13 నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement