Wednesday, April 24, 2024

మ్యూచువల్‌ఫండ్‌తో ఫిక్స్‌డ్‌ ఇన్‌కం.. ఏప్రిల్‌లో రూ.15వేల కోట్ల ఫండ్స్‌

న్యూఢిల్లి : స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న అస్థిరత, దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల నేపథ్యంలో.. చాలా మంది ఫిక్స్‌డ్‌ ఇన్‌కం వైపు పరుగులు పెడుతున్నట్టు తెలుస్తున్నది. మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా రాబడులు పొందేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. వరుసగా 14వ నెలైన ఏప్రిల్‌ కూడా.. మెరుగైన మ్యూచువల్‌ ఫండ్‌ గణాంకాలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా రూ.15,890 కోట్ల వ్యాపారం జరిగింది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) డేటా ప్రకారం.. గత నెలలో చూసిన రూ.28,463 కోట్ల రికార్డు నికర ఇన్‌ఫ్లోతో పోలిస్తే.. ఇది చాలా తక్కువగా ఉందని ఏఎంఎఫ్‌ఐ వివరించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ రంగంలో కొనసాగుతున్న ప్రతికూలతలు, సవాళ్లను దృష్టిలో పెట్టుకుని మదుపరులు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో ఇన్‌ఫ్లో తక్కువగా నమోదవ్వడానికి కారణం మార్కెట్‌లో నెలకొన్న అస్థిరతే అని తెలిపింది. ఇన్వెస్ట్‌మెంట్‌ పోకడలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అస్థిరత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో సానుకూల ధోరణితో ముందుకు సాగుతున్నారని వివరించారు. ఈక్విటీ స్కీంలు.. మార్చి 2021 నుంచి నికర ఇన్‌ఫ్లోను చూస్తున్నాయి. కరోనా రెండో వేవ్‌ ఫలితంగా.. కరెక్షన్‌ నెలకొంది. ఇది పెట్టుబడిదారుల్లో సానుకూలమైన సెంటిమెంట్‌ను హైలైట్‌ చేసింది.

బలంగా సిప్‌ ఫ్లో..

ఇటువంటి స్కీంలు.. జులై 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు 8 నెలల పాటు స్థిరంగా బయటికి వెళ్లి రూ.46,791 కోట్లు కోల్పోయాయి. అన్ని ఈక్విటీ ఆధారిత కేటగిరీలు ఏప్రిల్‌లో నికర ఇన్‌ఫ్లోలను అందుకున్నాయి. సెక్టోరల్‌/థీమాటిక్‌ ఫండ్స్‌ కేటగిరీ రూ.3843 కోట్ల నికర ఇన్‌ఫ్లోతో అతిపెద్ద లబ్దిదారుగా ఉంది. ఈ విభాగం కొత్త ఫండ్‌ను కూడా ప్రారంభించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ హౌసింగ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌.. రూ.3,130 కోట్లను సమీకరించింది. దీని తరువాత.. లార్జ్‌ , మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ రూ.2,000 కోట్ల నికర ఇన్‌ఫ్యూషన్‌ను సాధించింది. మార్కెట్స్‌లో అస్థిరత, ప్రపంచ వ్యాప్తంగా, స్థానికంగా మాక్రోల చుట్టూ ఆందోళన ఉన్నప్పటికీ.. ఈక్విటీలలో నిరంతర సానుకూల పరిణామాలు చూడటం పాజిటివ్‌ అంశమే. సిప్‌ ఫ్లో బలంగా ఉన్నాయి. ఇది కూడా సానుకూలంగా ఉంది. నెలవారీ సిప్‌ (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) సహకారం మార్చిలో రూ.12,328 కోట్లతో పోలిస్తే.. ఏప్రిల్‌లో రూ.11,863 కోట్లకు పడిపోయింది. సిప్‌ ఖాతాల సంఖ్య ఏప్రిల్‌లో 5.39 కోట్లకు చేరుకుంది. ఈక్విటీలు కాకుండా.. రుణ విభాగం ఏప్రిల్‌లో రూ.69,883 కోట్ల నికర ఇన్‌ఫ్లోను చూసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement