Saturday, April 20, 2024

ఎఫ్‌ఐఐల చూపు 4 రంగాలపైనే..

వడ్డీరేట్ల పెంపుతో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నెమ్మదిస్తుందనే అంచనాల మద్య విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) మన ఈక్విటీ మార్కెట్లలో మళ్లి భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 10 నెలల్లో 1,38,000 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకునన సంగత విధితమే. ఈ నెలలో మళ్లిd ఎఫ్‌ఐఐలు నికర కొనుగోలుదారులుగా మారుతున్నారు. నవంబర్‌ నెలలో తొలి 15 రోజుల్లో 28,888 కోట్ల రూపాయల పెట్టుబడులను మన ఈక్వీటి మార్కెట్లకు తరలించారు. ఇందులో 20 వేల కోట్లు కేవలం నాలుగు రంగాల షేర్లలోకే వెళ్లాయని ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా చెబుతోంది. ఇందులో 11,452 కోట్లు ఒ్క ఆర్ధిక సేవల రంగంలోకి వచ్చాయి.

తరువాత స్థానంలో ఎఫ్‌ఎంసీజీ రంగం ఉంది. అంతక్రితం పక్షంతో పోలిస్తే ఈ రంగంలోకి 7 రేట్లు పెట్టుబడులు పెరిగి, 3,514 కోట్లకు చేరాయి. ఐటీ, వాహన రంగాల షేర్లలోకి వరుసగా 3,005 కోట్లు, 2,251 కోట్ల పెట్టుబడులు వెళ్లాయి. మరోవైపు మన్నికైన వినిమయ వస్తువులు, టెక్స్‌టైల్స్‌ రంగాల షేర్లను ఎఫ్‌ఐఐలు విక్రయించారు. గతంలో పోలిస్తే స్థిరాస్తి షేర్లలో విక్రయాలు నెమ్మదించాయి. విద్యుత్‌ రంగంలో నిక ర విక్రేతలుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement