Thursday, April 18, 2024

ఏపీలో ఆదాయాన్ని మించిన వ్యయం.. తొలి ఆరు నెలల్లోనే రూ.77,672 కోట్ల లోటు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తొలి అర్ధ సంవత్సరం లోటుతో ముగియగా.. రెండో అర్ధ సంవత్సరం ఓవర్‌డ్రాప్ట్‌తో ప్రారంభమైంది. తొలి ఆరు నెలల్లోనే రూ.77,672 కోట్లు లోటుగా నమోదు కావడం గమనార్హం. ఇది ఆర్థిక సంవత్సరం అంతానికి రూ.లక్షన్నర కోట్ల వరకు చేరుకునే ప్రమాదం ఉంటుందని సమాచారం. ఇక రెండో త్రైమాసికంలోని తొలి నాలుగు రోజుల్లో మూడు రోజులు ఓవర్‌డ్రాప్ట్‌లోనే ఉండటం విశేషం. గతేడాదికి ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరం రూ.40 వేలకోట్ల వరకు ఉండగా, ఈ ఏడాది ఈ అంతరం ఏకంగా రూ.77 వేలకోట్లు దాటిపోవడం విశేషం. తాజాగా తెలిసిన వివరాల మేరకు తొలి ఆరు నెలల్లో రూ.45,567 కోట్లు సొంత ఆదాయం లభించగా, ఖర్చు ఏకంగా రూ.1,24,243 కోట్లుగా ఉన్నట్లు తెలిసింది. ఏ ఏడాది రూ.10 వేలకోట్లు కన్నా తక్కువ లోటు 0కనిపించలేదు. అతి తక్కువగా ఆగస్టులో రూ.10,080 కోట్లు లోటు రికార్డయ్యింది. అక్టోబరు నుంచి ప్రారంభమైన రెండో అర్ధ సంవత్సరం ఓవర్‌డ్రాప్ట్‌తోనే కొనసాగుతుండటం గమనార్హం.

ఇప్పటికి వారం రోజులు పూర్తి కాగా, అందులో నాలుగు రోజులు ఓడిలోనే ఉంది. తొలుత రూ.1900 కోట్లు వరకు ఓడి ఉండగా, తరువాత అది రూ.2,975 కోట్లకు చేరిపోయింది. నాలుగో తేదీన రిజర్వు బ్యాంకు నుంచి సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.2 వేలకోట్లు రుణం వెంటనే ఓడి కింద రిజర్వు బ్యాంకు జమచేసుకున్నట్లు తెలిసింది. తరువాత మరికొంత ఓడికి వెళ్లడంతో తాజాగా ఇంకా రూ.1,635 కోట్ల వరకు ఓవర్‌డ్రాప్ట్‌లో ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితి లోనే నిధుల లేమితో ఇంకా కొంతమంది ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు అందలేదని, పింఛనుదారులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement