Saturday, April 20, 2024

ఎంఎస్‌ఎంఈలకు ఈ-కామర్స్‌ మార్గనిర్దేశనం..

హైదరాబాద్, (ప్రభ న్యూస్‌) : ఉత్పత్తుల పట్ల నమ్మకం పెంపొందించడంలో ఎంఎస్‌ఎంఈలకు ఈ-కామర్స్‌ మార్గనిర్దేశనం చేయనుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యుడు భాస్కర్‌ రెడ్డి వెల్లడించారు. దేశానికి వెన్నుముక ఎంఎస్‌ఎంఈ. దేశ ఆర్థిక వృద్ధికి ఇవి అత్యంత కీలకం. తెలంగాణాలో దాదాపు 26.05 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఉండగా, వారిలో 25 లక్షకుపైగా యూనిట్లు సూక్ష్మ వ్యాపార సంస్థలు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఎంఎస్‌ఎంఈలు కలిగిన ఐదవ రాష్ట్రం తెలంగాణా. ఈసందర్భంగా కె భాస్కర్‌ రెడ్డి నిర్వహించిన అమెజాన్‌ సంభవ్‌ మూడవ ఎడిషన్‌లో భాగంగా నిర్వహించిన చర్చా వేదికలో మాట్లాడుతూ.. ఎంఎస్‌ ఎంఈ కమ్యూనిటీకి నైపుణ్యం నిర్మించాల్సిన ఆవశ్యకతను వెల్లడించారు. వినియో గదారుల నడుమ ఉత్పత్తుల పట్ల నమ్మకాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని గురించి తెలుపుతూ, ఎంఎస్‌ఎంఈల కోసం భారతదేశపు సమ్మిళిత వృద్ధి అజెండాను ప్రోత్సహించే రీతిలో జీఎస్‌టీ కార్యాచరణ ఉండాల్సిన అవసరముందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement