Monday, March 25, 2024

ఈవీ స్కూటర్లపై డిస్కౌంట్లు

దేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగడంలేదు. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు పలు కంపెనీలు డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు సైతం కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకు రావడంలేదు. దీని వల్ల డిమాండ్‌ పెరగడంలేదు. సాధారణంగా ఈవీ కస్టమర్లు అధిక దూరం ప్రయాణించే వాహనాలను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మకాలు నెమ్మదించాలని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్త మోడళ్లకు కూడా ఆఫర్లు ఇస్తున్నాయి.

ఫిబ్రవరిలో 65,700 ఈవీ టూవీలర్‌ యూనిట్లు అమ్మ్‌కాలు జరిగాయి. డిసెంబర్‌, జనవరిలోనూ ఇదే మాదిరి అమ్మకాలు నమోదయ్యాయి. పండుగల సీజన్‌లోనూ అమ్మకాలు పెరగకపోవడంతో కంపెనీలు ఆఫర్ల ప్రకటిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్‌1 ప్రో మోడల్‌ ధరను 16 వేలు తగ్గించింది. లోన్‌పై తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయడంలేదు. ఎలాంటి డౌన్‌ పేమెంట్‌ లేకుండానే వాహనాలను అందిస్తోంది. ఏథర్‌ ఎనర్జీ ఈవీ స్కూటర్లపై 17 వేల వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఒక ఒకినోవా ఆటోటెక్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీలను నిలిపివేసింది. దీని వల్ల ఈ కంపెనీ వాహనాల ధరలు పెరిగాయి. దీని వల్ల అమ్మకాలు తగ్గాయి. దీంతో కంపెనీ పాత స్టాక్‌పై 8,750 వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది. కొత్త స్టాక్‌పై మాత్రం ఈ ప్రయోజనాలు ఉండవని ప్రకటించింది.

గ్రీవ్స్‌కాటన్‌ చెందిన యాంపియర్‌ కొత్త మోడల్‌ ప్రైమస్‌పై 5 వేల వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. జితేంద్ర కంపెనీ ఈవీలపై 6 వేల రకు రాయితీ ఇస్తోంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ టీవీఎస్‌ మోటార్స్‌ ఈ మార్చి నాటికి నెలకు 25 వేల యూనిట్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరిలో ఇందులో సగం యూనిట్లనే విక్రయించింది. ఏథర్‌ ఎనర్జీ నెలకు 20వేల యూనిట్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం 9 వేల యూనిట్లను మాత్రమే విక్ర యించకలిగింది. 2023 నవంబర్‌ నాటికి 10 లక్షల వాహనాల తయారు చేయాలని ఓలా లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -

ఫిబ్రవరిలో ఓలా 17,700 యూనిట్లను మాత్రమే విక్రయించింది. క్రమంగా ఈవీల పట్ల వాహనదారుల్లో అవగాహన పెరగడంతో అనేక విషయాలను వారు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. చాలా కంపెనీలు ప్రభుత్వం ఇస్తున్న ఫ్రేమ్‌ సబ్సిడీని వినియోదారులకు బదిలీ చేయడంలేదు. ఈ మేరకు రేటు పెంచి విక్రయిస్తున్నాయి. ఫలితంగా కొద్ది దూరం మాత్రమే వెళ్లకలిగే ఈవీ టూ వీలర్ల ధరలు కూడా లక్ష దాటి ఉంది. దీని వల్లే వీటి అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదని వాహన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement