Thursday, April 18, 2024

తెలుగులోనూ మై లో సర్వీసులు

హైదరాబాద్‌,(ప్రభ న్యూస్‌) : డిజిటల్‌ పేరెంటింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ అయిన మై లో తెలుగులోనూ తన సర్వీసులను (యాప్‌) ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో తన సేవలను విస్తరించాలని యోచిస్తోంది. ఇండియా వ్యాప్తంగా మై లో యాప్‌ ను 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మై లో యాప్‌ వ్యవస్థాపకుడు అండ్‌ సీఈఓ అయిన వినీత్‌ గార్గ్‌ మాట్లాడుతూ… తమ వద్ద ఉన్న 10మిలియన్ల మంది తల్లిదండ్రుల సంఘం నుంచి పొందిన ఇన్పుట్స్‌ ఆధారంగా.. తమ సేవలను అన్ని ప్రాంతీయ భాషల్లోకి విస్తరించాలని నిర్ణయించుకున్నామన్నారు.

వినియోగదారులు వారి మాతృభాషలో మరింత సుళభంగా విషయాలను అర్థం చేసుకుంటు-న్నారని గుర్తించినట్లు తెలిపారు. తెలుగు భాషలో యాప్‌ అనేది.. మొదటి అడుగు మాత్రమే అని, అతి త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషల్లో మై లో యాప్‌ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, యాప్‌ లో తెలుగు మాట్లాడే కమ్యూనిటీ- నుంచి తమకు అద్భుతమైన ఫీడ్‌ బ్యాక్‌ (అభిప్రాయం) వచ్చిందని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement