Thursday, April 25, 2024

64 శాతం పెరుగిన డీమార్ట్‌ లాభం..

డీ మార్టు పేరుతో రిటైల్‌గా అమ్మకాలు జరిపే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఈ త్రైమాసికంలో సంస్థ నికర లాభానని 685.71 కోట్లు అర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నికర లాభం 64.13 శాతం వృద్ధి నమోదు చేసింది. గత సంవత్సరం రెండు త్రైమాసికంలో సంస్థ 417.76 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది.


కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 33.58 శాతం పెరిగింది. గత సంవత్సరం రెండో త్రైమాసికంలో 7,788.94 కోట్లు ఉన్న ఆదాయం ఈ త్రైమాసికంలో 10,638.33 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం వ్యయం 9,925.95 కోట్లుగా నమోదైంది.
డి మార్ట్‌ 2002లో ముంబైలో మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. 2022 సెప్టెంబర్‌ నాటికి ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 302 స్టోర్లను నిర్వహిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement