Saturday, April 20, 2024

ఈ-కామర్స్‌ వృద్ధికి, డెలివరీ కీలకం.. వెంచుర సెక్యూరిటీస్‌ అంచనా

భారతదేశంలో ఈ-కామర్స్‌ వృద్ధికి మూల కారణం డెలివరీ అని సుప్రసిద్ధ బ్రోకరేజీ సంస్థ వెంచుర సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఈ సంస్థ తమ తాజా నివేదికలో డెలివరీకి లాభాలు మరింత వృద్ధి చెందే అవకాశాలు సమీప కాలంలో ఉన్నట్టు వెల్లడించింది. మౌలిక వసతుల ఆధారిత వృద్ధిపై భారత్‌ ప్రభుతం పెట్టుబడులు పెట్టడాన్ని లక్ష్యంగా చేసుకున్న వేళ ఈ కంపెనీ ఐపీఓగా రానుంది. దీనికితోడు పీఎం గతిశక్తి కార్యక్రమం కూడా ప్రారంభం కావడంతో కంపెనీకి దీర్ఘ కాలంలో అది ప్రయోజనం కలిగించనుంది. వెంచుర సెక్యూరిటీస్‌ వెల్లడించిన దాని ప్రకారం.. డెలివరీ ఆదాయం 56.7 శాతం వృద్ధి చెంది 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.14,026 కోట్లకు చేరనుంది. డెలివరీ ఆదాయం ప్రధానంగా ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌, సప్లయి చైన్‌, పార్‌ ్ట ట్రక్‌ లోడ్‌, క్రాస్‌ బోర్డర్‌ సరీస్‌ వంటివి అధిక ఆదాయం అందిస్తున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ సెబీ వద్ద తమ ఆర్‌హెచ్‌పీ సమర్పించింది. దీని ద్వారా రూ.5235 కోట్లకు ఐపీఓకు వెళ్లనుంది. శుక్రవారంతో సబ్‌ స్క్రిప్షన్‌ మూసివేశారు. యాంకర్‌ ఇన్వెస్‌ ్టమెంట్‌లో భాగంగా భారీ మొత్తంలో పెట్టుబడులు లభించాయి. మొత్తం రూ.5235 కోట్ల ఐపీఓలో రూ.4వేల కోట్లు తాజాగా జారీ చేయనుండగా.. మిగిలిన మొత్తాలను అమ్మకాలకు అందుబాటులో ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement