Friday, April 19, 2024

డీసీడబ్ల్యూ 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్‌.. సహాయపడుతున్న ట్రూకాల్‌ యాప్‌..

హైదరాబాద్‌, మే 11 (ప్రభ న్యూస్‌) : ట్రూకాలర్‌ యాప్‌లోని క్విక్‌ డయల్‌ ఫీచర్‌తో 181 ఉమెన్స్‌ హెల్ప్‌ లైన్‌ను అనుసంధానం చేయడంతో ఢిల్లీ కమీషన్‌ ఫర్‌ ఉమెన్స్‌ హెల్ప్‌లైన్‌ 181కు వచ్చే కాల్స్‌ సంఖ్య 200శాతం ఎక్కువ అందుకుంది. ఈ సంవత్సరం మార్చి నుంచి మహిళలు, బాలికలపై నేరాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రచారం ఇట్స్‌ నాట్‌ ఓకే లో భాగంగా ట్రూకాలర్‌ మహిళా భద్రతా హెల్ప్‌లైన్‌ నెంబర్‌ -181 ని తన డయలర్‌లో ప్రదర్శించడం ప్రారంభించింది. ఈసందర్భంగా ట్రూకాలర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ ప్రజ్ఞా మిశ్రా మాట్లాడుతూ…. కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ ఆధారిత వేధింపులకు వ్యతిరేకంగా భారతదేశంలో 10 కోట్ల మంది మహిళలు మొదటి రక్షణ కవచంగా ట్రూకాలర్‌ ఉపయోగిసున్నారన్నారు.

అత్యవసర సమయాల్లో 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఒక క్లిక్‌ ద్వారా అందుబాటు-లో ఉంచేలా ట్రూకాలర్‌ డయలర్‌లో అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్‌ను పిన్‌ చేయడం తమ వినియోగదారులను సురక్షితంగా ఉంచడంలో మరొక దశన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ మాట్లాడుతూ… ట్రూకాలర్‌ చేపట్టిన ఈ అద్భుతమైన ప్రోయాక్టివ్‌ చొరవను తాను అభినందిస్తున్నానన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ తన 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా గత 6 సంవత్సరాల్లో లక్షల మంది మహిళలు, బాలికలకు సాయం చేసిందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement