Wednesday, April 24, 2024

స్పైస్‌జెట్‌పై సైబర్‌ ఎటాక్‌.. ఆలస్యంగా ప్రారంభమైన సేవలు..

న్యూఢిల్లి : ప్రముఖ దేశీయ విమానయాన మీషో రికార్డు రిజిస్ట్రేషన్లుసంస్థ స్పైస్‌ జెట్‌ విమాన సేవలు బుధవారం ఉదయం ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు.. చేసిన సైబర్‌ దాడే దీనికి కారణమని సంస్థ తెలిపింది. ర్యాన్‌సమ్‌ మాల్‌వేర్‌ దాడివల్లే తమ వెబ్‌సైట్‌లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. దీంతో విమానాలు ఆలస్యంగా బయలుదేరాయని వెల్లడించింది. తమ ఐటీ బృందం సమస్యను గుర్తించి పరిష్కరించినట్టు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. బుధవారం
ఉదయం 8.30 సమయానికి ఈ విషయం తెలిసింది. ప్రయాణికులు మాత్రం ఎలాంటి సమాచారం వెల్లడించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు వేచి చూడాల్సి పరిస్థితి కనిపించింది. సేవల్లో నాణ్యత లేదని చెప్పుకొచ్చారు. సైబర్‌ కేటుగాళ్లు.. సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కీలక సమాచారాన్ని లాక్‌ చేస్తారు. దాన్ని అన్‌లాక్‌ చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తుంటారు. అయితే సైబర్‌ ఎటాక్‌ను స్పైస్‌జెట్‌ టెక్నికల్‌ బృందం తిప్పికొట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement