Thursday, March 28, 2024

5జీ ఆవిష్కరణకు దేశం ప్రాధాన్యత ఇవ్వాలి : ముఖేశ్ అంబానీ

ప్ర‌భ‌న్యూస్ : 5జీ టెలికమ్యూనికేషన్స్‌ ఆవిష్కరణకు దేశం ప్రాధాన్యత ఇవ్వాలని బిలియనీర్‌, రిలయన్స్‌ జియో అధినేత ముకేష్‌ అంబానీ అన్నారు. అంతేకాకుండా సరసమైన ధరలకే పరికరాలు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. 1 బిలియన్లకుపైగా మంది సబ్‌స్క్రైబర్లతో భారత టెలికాం మార్కెట్‌ ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదిగా ఉంది. 2జీ సబ్‌స్క్రైబర్లు సైతం ఖచ్చితంగా 4జీ వైపు, ఆ తర్వాత వీలైనంత త్వరగా 5జీ వైపు అడుగులు వేయాలని ముకేష్‌ అంబానీ సూచించారు. జియో ప్రస్తుతం 4జీ, 5జీ నిర్వహణ, బ్రాడ్‌బ్యాండ్‌ మౌలికస దుపాయాల విస్తరణపై దృష్టి సారించినట్టు ఆయన వెల్లడించారు.

గూగుల్‌, ఫేస్‌బుక్‌, క్వాల్‌కామ్‌, ఇంటెల్‌తోపాటు కీలకమైన టెక్‌ దిగ్గజాలతో భాగస్వామ్యం ఉండడంతో దేశంలో తొలుత 5జీ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించడంపై జియో విశ్వాసంతో ఉందని ముకేష్‌ అంబానీ ఇదివరకే చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో 5జీ స్పెక్ట్రం వేలం వేయనున్నామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించిన నేపథ్యంలో ముకేష్‌ అంబానీ ప్రకటన చేయడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement