Friday, October 4, 2024

Corteva – అగ్రి-వేల్యూ చెయిన్ లో మిలియన్ మహిళలను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కోర్టెవా అగ్రిసైన్స్ బోల్డ్ న్యూ ప్రోగ్రాం

న్యూఢిల్లీ, – కోర్టెవా అగ్రిసైన్స్, అంతర్జాతీయ వ్యవసాయ నాయకుడు, భారతదేశంలో అగ్రి-వేల్యూ చెయిన్ లో 2030 నాటికి రెండు మిలియన్ వుమెన్ (మహిళలకు) మద్దతు ఇవ్వడానికి సమగ్రమైన ప్రోగ్రాను ప్రారంభిస్తోంది. లక్ష్యభరితమైన మద్దతు, సాధనాలు మరియు వ్యవస్థలను కేటాయించడం ద్వారా, కోర్టెవా మహిళలను రైతులు, పరిశోధకులు మరియు ఔత్సాహికులుగా ప్రారంభించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ చొరవ వనరులను సమానంగా పొందడం మరియు నిర్ణయాలు చేసే బాధ్యతలను ప్రోత్సహిస్తుంది, ఉత్పాదకతను మెరుగుపరిచే టెక్నిక్స్ ను మెరుగుపరుస్తుంది మరియు ఆహార భద్రతను పెంచుతోంది. ఈ ప్రోగ్రాం సంప్రదాయబద్ధమైన కార్పొరేట్ బాధ్యతను అధిగమించింది, లింగ సమానత్వాన్ని సమీకృతం చేసే ఉద్యమాన్ని, సుస్థిరమైన అభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తోంది.

ఈ చొరవ ఆరంభంలో, సుబ్రొటో గీడ్- దక్షిణాసియా ప్రెసిడెంట్, కోర్టెవా అగ్రిసైన్స్, ఇలా అన్నారు, “మహిళలు గ్రామీణ జీవితం మరియు వ్యవసాయం యొక్క వెన్నుముక. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, విద్య, మరియు సుస్థిరమైన వ్యవసాయ పద్దతులు వారికి అందుబాటులో ఉంచడం ద్వారా వారి ఆదాయాలు, జీవితాలను మెరుగుపరచడానికి కోర్టివా కట్టుబడింది. ఈ ప్రాధాన్యత భారతదేశాన్ని అభివృద్ధి చెందిన మార్గంపై ప్రయాణింపచేస్తుందని మేము ఆశిస్తున్నాం. వారి సామాజిక బాధ్యతను తీసుకోవడానికి, వికసిత్ భారత్ దిశగా చర్య తీసుకోవడానికి గర్విస్తున్నాం.”

అనుజ కడియన్ – ప్రభుత్వం & ఇండస్ట్రీ వ్యవహారాల డైరెక్టర్ (ఆసియా పసిఫిక్), కోర్టెవా అగ్రిసైన్స్, ఇలా అన్నారు, “మా 2 మిలియన్ చొరవ మహిళలకు లింగ సమానత్వాన్ని, ఆర్థికాభివృద్ధిని మరియు పర్యావరణ సుస్థిరతను కలుపుతుంది. సాధనాలు, విజ్ఞానం, మరియు వనరులను కల్పించడం ద్వారా సుస్థిరాభివృద్ధిలో ప్రయాణించడానికి మహిళల కోసం మార్గం ఏర్పరుస్తోంది, భారతదేశపు ఆర్థిక సాధికారత లక్ష్యాలు, ఆహార భద్రత మరియు సుస్థిరాభివృద్ధికి మద్దతునిస్తోంది.”

మా కార్యక్రమాలు వ్యవసాయ విలువ గొలుసులో మహిళలకు సామర్థ్యం కలిగించే లక్ష్యాన్ని ఉన్నాయి:

· మహిళల నాయకత్వంలో రైతు ఉత్పత్తిదారు సంస్థలు మరియు మహిళా రైతులను అభివృద్ధి చేయడం: మహిళలు ద్వారా మాత్రమే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (FPOs) మరియు కోఆపరేటివ్స్ ద్వారా కోర్టెవా వ్యవసాయ –వేల్యూ చెయిన్ లో మహిళలను సమీకృతం చేసే సమీకృత వ్యవస్థను సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉంది. డైరెక్ట్ సీడెడ్ రైస్ (డిఎస్ఆర్), కార్బన్ సెక్వెస్ట్రేషన్, నేల ఆరోగ్య నిర్వహణ మరియు నీటి సంరక్షణ వంటి వాతావరణం-స్మార్ట్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా కోర్టెవా గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధితో పర్యావరణ సారధ్యం సమీకృతం చేస్తోంది.

- Advertisement -

· STEMలో మహిళలను అభివృద్ధి చేయడం: కోర్టెవా మహిళా STEM విద్యార్థులకు సామర్థ్యం రూపకల్పన, మరియు నాయకత్వాలను కేటాయిస్తుంది. మరింత సుస్థిరమైన, సమీకృత వ్యవసాయ రంగం కోసం భవిష్య నాయకులుగా మరియు ఆవిష్కరణకర్తలుగా వారిని మారుస్తుంది

· గ్రామీణ మరియు వ్యవసాయ సమాజాలను అభివృద్ధి చేయడం: కోర్టెవా మెరుగుపరచబడిన మౌళికసదుపాయంలో అనగా పరిశుభ్రమైన నీరు, మరియు నిల్వ చేసే సదుపాయాలలో పెట్టుబడి పెడుతోంది. ఈ చొరవలు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతాయి మరియు మహిళా రైతులు తమకు కావలసిన వనరులను కలిగి ఉండి విజయం సాధించడాన్ని నిర్థారిస్తాయి. ఇంకా, కోర్టెవా ప్రోగ్రాంస్ అవసరమైన సేవలకు యాక్సెస్ ను అందచేయడం ద్వారా ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక అక్షరాస్యతలకు, వ్యాపార నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తాయి తద్వారా సుస్థిరమైన వ్యవసాయ అభివృదధిని ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన మరియు మరింత సుసంపన్నమైన జీవితాలకు మార్గదర్శకత్వంవంహించడంలో మహిళా రైతులకు మద్దతునిస్తాయి.

కోర్టెవా వారి 2 మిలియన్ చొరవ వ్యవసాయ అభివృద్ధి మరియు ఆవిష్కరణలను ప్రోత్సాహదారులుగా మహిళలకు సాధికారత కల్పిస్తోంది. ఈ ప్రయత్నాలు వినూత్నత, ఆర్థికాభివృద్ధి, ఆహార భద్రతలను అభివృద్ధి చేసి, మరింత సమీకృతమైన వ్యవసాయ రంగాన్ని సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement