Wednesday, April 24, 2024

ఢిల్లిలో సీఎన్‌జీ ధరల పెంపు

ప్ర‌భ‌న్యూస్ : ఢిల్లి, హర్యానా, రాజస్థాన్‌లలో సీఎన్‌జీ(కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) ధరలు పెంచినట్టు ఇంద్రప్రస్త గ్యాస్‌ లిమిటెడ్‌(ఐజీఎల్‌) ప్రకటించింది. సవరణ అనంతర ఢిల్లిలో సీఎన్‌జీ కేజీ ధర రూ.53.04గా ఉంది. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ వివరించింది. ఢిల్లితోపాటు హర్యానా, రాజస్థాన్‌లో ఎంపిక చేసిన పలు నగరాల్లో సీఎన్‌జీ ధరలు పెంచినట్టు ఇంద్రప్రస్త పేర్కొంది. కాగా గురుగ్రామ్‌లో సవరణ తర్వాత సీఎన్‌జీ ధర రూ.60.40గా ఉంది. రెవారీలో కేజీ రూ.61.10గా ఉంది.

కాగా కర్నాల్‌, కైతాల్‌లలో సవరణ అనంతరం సీఎన్‌జీ ధర రూ.59.30 గా ఉందని ఇంద్రప్రస్త గ్యాస్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ధరలు పెంచిన విషయాన్ని టిట్టర్‌ వేదికగా కంపెనీ ప్రకటించింది. రాజస్థాన్‌లో అజ్మీర్‌, పాలి, రాజ్‌సమంద్‌లలో సీఎన్‌జీ రేట్లు పెంచినట్టు పేర్కొంది. ఇంద్రప్రస్త గ్యాస్‌ ప్రధానంగా ఢిల్లిdలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. గెయిల్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం, ఢిల్లి ప్రభుతాల మధ్య జాయింట్‌ వెంచర్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. 1998లో ఈ కంపెనీని ప్రారంభించారు. కాగా శుక్రవారం ఇంద్రప్రస్త గ్యాస్‌ లిమిటెడ్‌ షేర్లు 1.51 శాతం వృద్ధి చెంది రూ.505.60 వద్ద ముగిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement