Thursday, October 3, 2024

WhatsApp | వాట్సాప్‌లో చాట్‌ థీమ్‌…

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన ఫ్లాట్‌ఫామ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ఆల్‌ ఇన్‌ వన్‌గా తయారు చేస్తోంది. ఈక్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఇప్పటికే యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనేక ఫీచర్లను తీసుకొచ్చింది.

కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు త్వరలో థీమ్‌చాట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచర్‌ సాయంతో వినియోగదారులు అనేక రకాల థీమ్‌ను తమ చాట్‌కు జోడించుకునే సౌలభ్యం ఉంటుంది. తమ స్క్రీన్లను తమకిష్టమైన రంగులతో ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడంతోపాటు, చాటింగ్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఈ తరహా సదుపాయాన్ని తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, వాట్సాప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌స అందించే వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లోపంచుకుంది. ఈ సౌకర్యం త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement