Thursday, November 28, 2024

HYD | హృదయం ఆకారంలో.. లేయర్ జెల్లీని పరిచయం చేసిన అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ

హైద‌రాబాద్: అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ పర్ఫెట్టి వాన్ మెల్లీ సంస్థ నుండి దిగ్గజపు బ్రాండ్ అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ, భారతదేశపు మొదటి హృదయం ఆకారపు, డ్యూయల్-లేయర్ జెల్లీని పరిచయం చేసింది. అందుబాటులో ఉండే విధంగా కేవలం రూ.2కి ఒక విలక్షణమైన అనుభూతి ప్రయాణాన్ని అందించడానికి అందజేయబడింది. ఈ వినూత్నమైన జెల్లీ రెండు విలక్షణమైన లేయర్స్ ను కలిగి ఉంది. మృదువైన – ఫోమీ (నురగ) పొర, జెల్లీ పొర, ఇది మృదువైన అండ్ నమిలే అనుభవానికి దారితీస్తుంది. మొత్తం వినియోగ అనుభవాన్ని మెరుగు పరిచే ఆనందకరమైన కలయికను సృష్టిస్తుంది. అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ జెల్లీ శ్రేణిలో వినూత్నతను కొనసాగిస్తోంది.

ఈసందర్భంగా పర్ఫెట్టి వాన్ మిల్లే ఇండియా ఛీఫ్ మార్కెటింగ్ అధికారి గుంజన్ ఖేతన్ మాట్లాడుతూ… భారతదేశంలో జెల్లీ మార్కెట్ నిరంతరంగా వృద్ధి చెందుతోందన్నారు. ఎందుకంటే వినియోగదారులు కొత్త అనుభవాలు కోరుకుంటున్నారన్నారు. అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ హార్ట్ తో తాము సృజనాత్మకత హద్దులను అధిగమించి ఆనందకరమైన ఆకారంతో పాటు విలక్షణమైన ఆకృతిని కూడా కలిసిన ఉత్పత్తిని అందిస్తున్నామన్నారు. కేవలం రూ.2 ధరకి, తమ మిఠాయి ఎంపికలలో నాణ్యత, విలువ కోసం పరిశీలిస్తున్న వినియోగదారుల కోసం ఇది ఆనందకరమైన అనుభవమన్నారు. రెండు-లేయర్స్, మృదువైన, నురగతో, నమిలే అనుభవాన్ని వినియోగదారులకు ఇచ్చే ఈ ప్రీమియం ఆఫరింగ్ ను పరిచయం చేయడానికి తాము ఉత్సాహంగా ఉన్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement