Friday, April 19, 2024

శాంసంగ్‌ ఫోన్లలో ఎయిర్‌టెల్‌ 5జీ

దేశంలో పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఓఎస్‌ సపోర్ట్‌ చేయకపోవడంతో ఈ నెట్‌వర్క్‌ ను కస్టమర్లు అందుకోలేకపోతున్నారు. దీంతో మొబైల్‌ కంపెనీలు ఓవర్‌ ది ఎయిర్‌ ఓఎస్‌ ఆప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాయి. తాజాగా శాంసంగ్‌ ఈ ఆప్‌డేట్‌ను విడుదల చేసింది. దీంతో ఇకపై అన్ని శాంసంగ్‌ 5జీ ఫోన్లలో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు పొందవచ్చని కంపెకనీ తెలిపింది. తక్కువ సమయంలోనే శాంసంగ్‌ ఏటీఏ ద్వారా ఓఎస్‌ అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఎయిర్‌ టెల్‌ 5జీ ఎస్‌ఎస్‌ఏ ద్వారా ఈ సేవలను అందిస్తోంది.

రానున్న రోజుల్లో ఎస్‌ఏ ద్వారా అందిస్తామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. 5జీ సేవలు ప్రారంభించిన నెల రోజుల్లోనే 10 లక్షల మంది యూజర్లను ఎయిర్‌టెల్‌ పొందింది. ఎయిర్‌ టెల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌, ఢిల్లి, ముంబై, చెన్నయ్‌, బెంగళూర్‌, సిలిగుడి, నాగ్‌పూర్‌, వారణాశి, పుణే, గుర్గావ్‌, గువహటి, పానిపట్‌ నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ నెట్‌వర్క్‌ సేవలు అందిస్తోంది. శాంసంగ్‌ తాజా అప్‌డేట్‌తో అన్ని ఫోన్లలోనూ 5జీ నెట్‌వర్క పొందవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement