Friday, March 29, 2024

సర్వీసులు పెంచిన ఎయిరిండియా

ఎయిర్‌ ఇండియా అమెరికా, బ్రిటన్‌కు అదనపు సర్వీస్‌లు నడపనుంది. బర్మింగ్‌హామ్‌, లండన్‌, శాన్‌ప్రాన్సి స్కోకు వారానికి అదనంగా 20 విమాన సర్వీస్‌లు నడపాలని ఎయిర్‌ ఇండియా నిర్ణయించింది. బర్మింగ్‌హామ్‌కు 5, లండన్‌కు 9, శాన్‌ఫ్రాన్సిస్కోకు 6 విమానాలు నడుపుతామని ఎయిర్‌ఇండియా తెలిపింది. దీని వల్ల అదనంగా 5వేల సీట్లు అందుబాటులోకి వస్తాయి. బ్రిటన్‌కు ప్రస్తుతం వారానికి 34 విమాన సర్వీస్‌లను ఎయిర్‌ఇండియా నడుపుతోంది. బర్మింగ్‌హామ్‌కు వెళ్లే ఐదు సర్వీస్‌ల్లో ఢిల్లి నుంచి మూడు, అమృత్‌సర్‌ నుంచి రెండు విమానాలు బయలుదేరనున్నాయి. అండన్‌కు వెళ్లే 9 సర్వీస్‌ల్లో ముంబాయి నుంచి 5, ఢిల్లి నుంచి 3, అహ్మదాబాద్‌ నుంచి 1 చొప్పున బయలుదేరుతాయి.

దేశంలో ఏడు నగరాల నుంచి అండన్‌కు నాన్‌స్టాప్‌ విమానాలు అందుబాటులోకి వచ్చాయని ఎయిర్‌ ఇండియా తెలిపింది. అమెరికాకు ఎయిర్‌ఇండియా వారానికి 34 సర్వీస్‌లను నడుపుతోంది. తాగా సర్వీస్‌లు పెంచడంతో ఈ సంఖ్య 40కి పెరగనుంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే అదనపు విమానాల్లో ముంబై, బెంగళూర్‌ నుంచి వారానికి మూడు రోజుల చొప్పున విమానా సర్వీసులు నడపనుంది. ఈ అదనపు సర్వీస్‌లను అక్టోబర్‌, డిసెంబర్‌ మధ్య దశలవారిగా ప్రవేశపెట్టనున్నట్లు ఎయిర్‌ఇండియా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement