Tuesday, April 23, 2024

మేక స్పేస్‌ యోగా కలెక్షన్‌ను ప్రారంభించిన అడిడాస్‌ ఇండియా…

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : ప్రముఖ స్పోర్ట్స్‌ వేర్‌ బ్రాండ్‌ అడిడాస్‌ ఇండియా సరికొత్త కలెక్షన్‌ తో ముందుకొచ్చింది. యోగా సాధన చేసే వారి కోసం ప్రత్యేకంగా యోగా మేక్‌ స్పేస్‌ కలెక్షన్‌ ను అందుబాటు-లోకి తెచ్చింది. అగ్ని, భూమి, గాలి, నీరు, రీసైకిల్‌ చేసిన మెటీరియల్‌ నుంచి ప్రేరణపొంది అడిడాస్‌ వీటిని రూపొందించింది. దీనిపై నటి దీపికా పదుకునే మాట్లాడుతూ…

అటు- రెండేళ్లుగా తాను యోగా ప్రాక్టీస్‌ చేస్తున్నానని తెలిపారు. శారీరక, మానసిక ప్రశాంతతకు యోగా అద్భుతమైన సాధనమని చెప్పారు. మనసు, శరీరాన్ని నియంత్రించగలిగే గొప్పగుణం యోగాకు ఉందని పేర్కొన్నారు. సాధన చేయాలన్న పట్టుదల ఉండే ఎక్కడైనా యోగాను చేయొచ్చని తెలిపారు. యోగా ప్రాక్టీస్‌ ద్వారా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నానని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement