Tuesday, November 29, 2022

విదేశాల్లో అదానీ కుటుంబ కార్యాలయం..!

ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ విదేశాలలో కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. పోర్టుల నుంచి పవర్‌ వరకు వివిధ కీలక రంగాల్లో ప్రధాన సంస్థగా ఉన్న అదానీ గ్రూపు ఛైర్మన్‌ దుబాయ్‌ లేదా న్యూయార్క్‌వైపు దృష్టిసారించారు. ఈ ఏడాది అదానీ వ్యక్తిగత సంపద 58 బిలియన్‌ డాలర్లు పెరిగిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. తమ సంపద, వ్యక్తిగత పెట్టుబడులు, దాతృత్వాన్ని నిర్వహించడానికి కుటుంబ కార్యాలయాలను కలిగి ఉన్న అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్‌ అదానీ చేరనున్నాడు. హెడ్జ్‌ ఫండ్‌ బిలియనీర్‌ రే డాలియో, గూగుల్‌ సహవ్ఖ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ సింగపూర్‌లో తమ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.

- Advertisement -
   

ముఖేష్‌ అంబానీ కూడా విదేశాల్లో కుటుంబ కార్యాలయాన్ని ప్రారంభించే ప్రక్రియలో ఉన్నారని బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ నివేదించింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ దుబాయ్‌లో ఉన్నారు. దుబాయ్‌తోపాటు సింగపూర్‌, జకార్తాలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తాజా హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రవాస భారతీయుడు అయిన వినోద్‌, వాణిజ్య సంస్థలలో పెట్టుబడులు పెట్టడానికి, వాటిని నిర్వహించడానికి 2016లో స్థాపించబడిన అదానీ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సంస్థను నడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement