Saturday, April 20, 2024

ఎఫ్‌పీఓ ద్వారా 20 వేల కోట్ల సేకరించనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ -ఎఫ్‌పీఓ ద్వారా 20 వేల కోట్లు సమీకరించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నాడు బోర్డు ఇందుకు ఆమోదం తెలిపిందని, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా షేర్‌ హెల్డర్ల ఆమోదం తీసుకుంటామని తెలిపింది. దీనికి ఆమోదం లభిస్తే దేశంలో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద ఎఫ్‌పీఓగా నిలవనుంది. 2020లో యెస్‌ బ్యాంక్‌ ఎఫ్‌పీఓ ద్వారా 15,000 కోట్లు సమీకరించింది. ఇదే ఇప్పటి వరకు అతి పెద్ద ఎఫ్‌పీఓగా ఉంది.

ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ల వాటా 72.63 శాతంగా ఉంది. మిగిలిన 27.37 శాతం వాటాల్లో 20 శాతం వరకు బీమా కంపెనీలు, విదేశీ మదుపర్ల వద్ద ఉన్నాయి. ఇలా వాటాలు కొంతమంది వద్దే కేంద్రీకృతమై ఉండటం వల్ల విమర్శలు వస్తున్నాయని ఇటీవల సంస్థ ఓ సందర్భంలో పేర్కొంది. ఎఫ్‌పీఓ ద్వారా రిటైల్‌ మదుపర్ల పెరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement