Saturday, March 25, 2023

పది రోజుల్లో 5 వేల కోట్లు.. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు

ఈ నెలలో (శుక్రవారం వరకు) భారత ఈక్విటీ మార్కెట్‌లో ఎఫ్‌పీఐ (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు)… రికార్దు స్థాయిలో రూ. 5 వేల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల డేటా ఈ రోజు (ఆదివారం) వివరాలను వెల్లడించింది. పండుగ సీజన్‌లో గృహోపకరణాల వ్యయంలో ఆశించిన వృద్ధితోపాటు ఇతర మార్క్‌ట్లలో నెట్‌ డెవలప్‌మెంట్స్‌ నేపథ్యంలో…. ఈ పెట్టుబడులు నమోదైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా… ఆగస్టు నెలలో కూడా రూ. 5,200 కోట్ల పెట్టుబడులు నమోదైన విషయం తెలిసిందే. అయితే… సెప్టెంబరులో కేవలం 10 రోజుల వ్యవధిలోనే (శువ్రారం నాటికి)… దానిని అధిగమించి మరీ పెట్టుబడులు రావడం విశేషం.

గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు విదేశీ ఈక్విటీ మార్కెట్లలో భారీస్థాయిలో… అంటే రూ. 2.46 లక్షల కోట్ల మేరుకు విక్రయాలు జరిగిన విషయం తెలిసిందే. కాగా… ఈ నెల మొదటి పది రోజుల్లోనే భారీ పెట్టుబడులు రావడంపై మార్కెట్‌ నిపుణుడు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘భారత్‌లోఎఫ్‌పీఐ(ఫారిన్‌ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు) పెట్టుబడులు మరింతగా కొనసాగే అవకాశముంది’ అని పేర్కొన్నారు. కాగా… అమెరికన్‌ బాండ్‌ ఈల్డ్‌లు పెరుగుతుండడంతోపాటు, డాలర్‌ ఇండెక్స్‌ 110 కంటే అధికంగా ఉన్నపక్షంలో… ఇన్‌ఫ్లోలు ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. ఇక యూఎస్‌ ఫెడ్‌ ఫలితాలతో సంబంధం లేకుండా… ఎఫ్‌పీఐలు భారతీయ ఈక్విటీల కొనుగోళ్ళను కొనసాగిస్తారని విశ్లేషకులు పేర్కొంటుండడం గమనార్హం.

- Advertisement -
   

ఇక… డిపాజిటర్ల డేటా ప్రకారం… సెప్టెంబరు 1-9 మధ్యకాలంలొ భారతీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల నుంచి రూ. 5,993 కోట్ల మేర డంప్‌ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఆర్ధికవ్యవస్థలపరంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత వ్యవస్థలోకి ఎఫ్‌పీఐలు… భారీ కొనుగోళ్ళ ద్వారా పెట్టుబడులను డంప్‌ చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక ధరల తగ్గుదల, దేశీయ బాండ్‌ ఈల్డ్‌ల పెట్టుబడుల కారణంగా… భారత మార్కెట్‌ ఊపందుకున్నట్లు కోటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌(రిటెయిల్‌) హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు రానున్న పండుగల సీజన్‌లో… భారత్‌లోకి పెట్టుబడుల వేగం పెరుగుతుందని చెబుతుననారు. రష్యానుండి వస్తోన్న పెట్టుబడుల వేగం పెరగడం, దేశంలో చైనా ప్రత్యామ్నాయంగా ఉండడం సహా ఆయా పరిణామాలు భారత్‌లోకి అంతర్జాతీయ పెట్టుబడులు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

సెప్టెంబరు 21 న జరగనున్న ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ మీట్‌ సమావేశ ఫలితాలపై ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారుల దృష్టి నెలకొంది. ఇక ఫెడ్‌ వడ్డీ రేట్లను 75 బేసిస్‌ పాయింట్ల మేరకు పెరిగే అవకాశమున్నట్లు కూడా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్‌ ద్రవ్యోల్బణం జూన్‌లోని 40 సంవత్సరాల గరిష్ట స్థాయి నుంచి జులై నాటికి 8.5 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో… యూఎస్‌ ఫెడ్‌ బ్యాంక్‌ రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తోన్న నేపథ్యంలో… భారత్‌లోకి పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐల దృక్ఫథం మారుతున్నట్లుగా వినవస్తోంది. అంతేకాకుండా భారత్‌ ఈక్విటీలు కూడా దిద్దుబాటు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా వినవస్తుండడం కూడా ఎప్‌పీఐల వైఖరి మారేందుకు దోహదపడుతోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అధినేత గుప్తా పేర్కొన్నారు. భారత్‌తోపాటు దక్షిణ కొరియా, తైవాన్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలు కూడా పెట్టుబడుల విషయంలో సమీక్షించుకుంటోన్న తరుణంలో… భారత్‌లోకి ఙన్‌ఫ్లోలు పెరిగేందుకు పరిస్థితులు దోహదం చేస్తున్నాయని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement