Saturday, April 20, 2024

సోలార్‌ పవర్‌తో 32వేల కోట్లు ఆదా.. భారత్‌లో పెరుగుతున్న గ్రీన్‌ఎనర్జీ ఉత్పత్తి

2022 ప్రథమార్థంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా ఇంధన ఖర్చులో భారతదేశం 4.2 బిలియన్‌ డాలర్లు (రూ.32వేల కోట్లు) ఆదా చేసింది. మరోవైపు 19.4 మిలియన్‌ టన్నుల బొగ్గు అవసరాలను తప్పించిందని తాజా నివేదిక పేర్కొంది. ఎనర్జీ థింక్‌ ట్యాంక్‌ ఎంబర్‌, సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎనర్జీ ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌ గురువారం ఈ నివేదికను విడుదల చేశాయి. గత దశాబ్దంలో సౌరశక్తి వృద్ధిని విశ్లేషించింది. చైనా, జపాన్‌, భారతదేశం, దక్షిణ కొరియా, వియత్నాంతో సహా సౌర సామర్థ్యం కలిగిన టాప్‌-10 ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు ఆసియాలోనే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. చైనా, భారతదేశం, జపాన్‌, దక్షిణ కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌తో సహా ఏడు కీలక ఆసియా దేశాలు జనవరి-జూన్‌ 2022 వరకు దాదాపు 34 బిలియన్‌ డాలర్ల సంభావ్య శిలాజ ఇంధన ఖర్చులను నివారించాయి. ఇది మొత్తం శిలాజ ఇంధన ఖర్చులలో 9శాతానికి సమానం. ఈ ఏడాది మొదటి అర్ధభాగం నాటికి భారత్‌లో సౌర ఉత్పత్తి వల్ల 4.2 బిలియన్‌ డాలర్ల ఇంధన ఖర్చులను తప్పించింది. ఇది 19.4 మిలియన్‌ టన్నుల బొగ్గు అవసరాన్ని కూడా తప్పించింది.

  • చైనాలో సౌరవిద్యుత్‌ ద్వారా 34 మిలియన్‌ డాలర్లు ఆదా అయింది. ఇక్కడ మొత్తం విద్యుత్‌ డిమాండ్‌లో సౌరశక్తి వాటా 5శాతానికి చేరింది. ఈ కాలంలో అదనపు బొగ్గు, గ్యాస్‌ దిగుమతులలో 21 బిలియన్‌ డాలర్ల ఒత్తిళ్లను తప్పించింది.
  • చైనా తర్వాత జపాన్‌ 5.6 బిలియన్‌ డాలర్ల ఆదాతో అత్యధిక ప్రభావాన్ని చూసింది. వియత్నాం సౌర శక్తి అదనపు శిలాజ ఇంధన ఖర్చులలో 1.7 బిలియన్‌ డాలర్ల భారాన్ని తగ్గించింది.
  • 2022 జనవరి- జూన్‌ మధ్య విద్యుత్‌ డిమాండ్‌లో సౌరశక్తి 11శాతం (14 టెరావాట్‌) వాటాను కలిగి ఉంది. థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌లలో సౌరశక్తి వృద్ధి మందగించినప్పటికీ, నివారించబడిన ఇంధన వ్యయం ఇప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంది.
  • 2022 మొదటి ఆరు నెలల్లో థాయ్‌లాండ్‌ విద్యుత్తులో సౌరశక్తి వాటా 2 శాతం మాత్రమే ఉండగా, 209 మిలియన్‌డాలర్ల సంభావ్య శిలాజ ఇంధన ఖర్చులు నివారించబడ్డాయి.
  • దక్షిణ కొరియాలో, విద్యుత్‌ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా 5శాతంగా నమోదైంది. దీనివల్ల 1.5 బిలియన్‌ డాలర్ల శిలాజ ఇంధన వినియోగం మిగిలింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement