Friday, April 19, 2024

SUPER: ‘సర్కార్ వారి పాట’పై విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస‌లు

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన తాజా చిత్రం ‘సర్కార్ వారి పాట’ గురువారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ టాక్‌తో విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న ఈ సినిమాపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట’ బాగుందని విజయసాయిరెడ్డి అన్నారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారని ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement