Friday, December 6, 2024

ఏపీకి వెయ్యి కోట్లు ఇవ్వండి: కేంద్రానికి విజయసాయి విజ్ఞప్తి

భారీ వర్షాలు, వదరలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షిణ సాయం వెయ్యి కోట్లు ఇవ్వాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో లేవనెత్తుతూ తక్షణ సాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలోని రాయలసీమ జిల్లాలతోపాటు నాలుగు దక్షిణ కోస్తా జిల్లాల్లో అసాధారణ వర్షాలతో పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. దాదాపు 44 మంది ప్రాణాలు కోల్పోయారని, భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయని వివరించారు. సుమారు లక్షా 85 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు ధ్వంసమైపోయాయని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా తక్షణ సాయం కింద రూ. 1000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement