Sunday, November 28, 2021

ఏపీలో బీసీ జనగణన హర్షణీయం

ఏపీలో బిసి జనగణన చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం హర్షణీయమని కర్నూలు జిల్లా బీసీ నాయకులు అన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నారని కొనియాడారు. బిసిలంటే బ్యాక్ వర్డ్ కాదని బ్యాక్ బోన్ అని నిరూపించారని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయ్యాక బిసిలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మంత్రులు, చైర్మన్ లు, బిసి కార్పొరేషన్ చైర్మన్లలో బిసిలకు న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో బిసి కులాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి బిసిలకు న్యాయం చేసిన పాపాన పోలేదన్నారు. శాసనమండలికి, రాజ్యసభకు, ఏ ముఖ్యమంత్రి బిసిలకు చెందిన వారికి ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News