Friday, May 27, 2022

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి: చంద్రబాబుపై సజ్జల ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను చంద్రబాబు మరింత దిగజార్చారని అన్నారు. కావాలనే సీఎంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. పట్టాభి మాట్లాడిన మాటపై ముఖ్యంగా మహిళల్లో చర్చ జరగాలన్నారు. అధికారం లేకపోయేసరికి చంద్రబాబుకు మతిభ్రమించిందని విమర్శించారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాకరని ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. తెలుగు దేశం పార్టీని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామని సజ్జల తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పార్టీలకు స్థానం ఉండకూడదన్నారు. సీఎం జగన్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: మళ్లీ జగనే సీఎం.. చంద్రబాబుపై విశ్వాసం లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement