Thursday, April 18, 2024

తండ్రి వైఎస్ సమాధి సాక్షిగా.. జగన్, షర్మిల కలిసిన వేళ..

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆయన సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలుస్తారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. తండ్రి వైఎస్ వర్ధంతి అన్న జగన్, చెల్లి షర్మిలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది.

రాజకీయ విభేదాలతో అన్న జగన్, చెల్లి షర్మిల ఇద్దరూ దూరం దూరంగా ఉంటున్నారు. ఎవరి పార్టీని వారు చూసుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య కేవలం రాజకీయ విభేదాలే కాదు.. వ్యక్తిగతంగా కూడా దూరం ఉందంటూ చాలా రోజుల నుంచి ప్రచాచంలో ఉంది. జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఇద్దరూ వేర్వేరుగా తండ్రి సమాధి వద్ద ప్రార్ధనలు చేశారు. దీంతో వీరి మధ్య విభేధాలు ఉన్నట్లు బహిర్గతమైంది. ఇటీవల రాఖీ పండుగ రోజున కూడా షర్మిల అన్నకు రాఖీ కట్టలేదు. కేవలం సోషల్ మీడియా వేదికంగా శుభాకాంక్షలు మాత్రమే చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ నిజమేనని స్పష్టమైంది. అయితే ఇవాళ వైఎస్ఆర్ 12వ వర్ధంతి.. ఈ సందర్భంగా అయినా ఇద్దరు కలుస్తారా..? లేక ఎవరికి వారే అన్నట్లుగా ఉంటారా? అన్నది అందరిలో ఆసక్తి పెంచింది.

ఈ క్రమంలో ఇడుపులపాయలోని తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అన్న జగన్, చెల్లి షర్మిల ఒకే వేదికపైకి వచ్చారు. ఇద్దరూ కలిసే వైఎస్సార్ ను నివాళి అర్పించారు. వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ప్రార్ధనల్లో జగన్, షర్మిల ఇద్దరూ పక్క పక్కనే ఉన్నా.. పలకరించుకోలేదు. అయితే, చాలా రోజుల తర్వాత అన్న చెల్లి ఒకే వేదికపై కనిపించడంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.

ఇది కూడా చదవండి: జన హృదయ విజేత.. నేడు వైఎస్ వర్ధంతి!

Advertisement

తాజా వార్తలు

Advertisement