Friday, April 26, 2024

మరో 24గంటలపాటు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్

రాష్ట్రంలో వరదల నేపథ్యంలో మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయం అధికారులతో మాట్లాడిన సీఎం.. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలందించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని  సీఎం స్పష్టం చేశారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలన్నారు.

సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన అన్నికుటుంబాలకు చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలని సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement