Thursday, April 25, 2024

AP: నరకాసురుడినైనా నమ్మొచ్చు… చంద్రబాబును నమ్మొద్దు.. సీఎం జగన్

వెంక‌టాయ‌పాలెం: నరకాసురుడినైనా నమ్మొచ్చు.. కానీ చంద్రబాబును నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం జగన్ మాట్లాడుతూ… పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. పేదల కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించామన్నారు. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామన్నారు. అమరావతి ఇక మీదట సామాజిక అమరావతి అవుతుందన్నారు. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నానిని జగన్ అన్నారు. ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి అన్నారు. 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామన్నారు. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండుగ కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్‌ ప్రకటించారు. దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్‌ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ.లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని, రెండో ఆప్షన్‌లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తామని, ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుందన్నారు. స్టీల్‌, సిమెంట్‌, డోర్‌ ఫ్రేమ్‌లు సబ్సిడీపై అందిస్తామన్నారు. మెటీరియల్‌ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని సీఎం జగన్‌ ప్రకటించారు.

గతంలో ఇలాంటి ఆలోచనలు.. గత ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా ? అని జగన్ అన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో 5,024 మందికి పూర్తైన టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నామన్నారు. 300 చదరపు అడుగులు ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ దాదాపుగా రూ.5.75లక్షలు అవుతోంది. మౌలిక సదుపాయాల కోసం రూ.1 లక్ష అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే.. మిగిలిన డబ్బును బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని. 20 ఏళ్లపాటు ఆ లబ్ధిదారుడు కట్టుకుంటూ పోవాలన్నారు. మొత్తంగా రూ.7.2లక్షలు చెల్లించాల్సి ఉంటుంది పేదవాడు.. మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా అని అన్నారు. చంద్రబాబు చెప్పినట్టు.. టిడ్కో ఇళ్లను పేదవాడికి ఇచ్చినట్టేనా ? అన్నారు. మరి ఆ ఫ్లాటును పేదవాళ్లకు పూర్తిగా రూ.1కే అక్క చెల్లెమ్మల పేరున రాసిచ్చామన్నారు. కాని చంద్రబాబు, వారి గజ దొంగల ముఠాకు, ఎల్లోమీడియా వక్రభాష్యాలు చెప్తూనే ఉందన్నారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క ఇంటి పట్టాకూడా ఇవ్వలేదన్నారు. గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడన్నారు. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడన్నారు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడన్నారు. వారి కోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడని, మోసం చంద్రబాబును ఎప్పుడూ కూడా నమ్మకండని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement