Friday, March 29, 2024

ఒంగోలులో ప‌సుపు పండుగ‌.. మే 27 నుంచి మహానాడు ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు వేదిక ఖ రారైయింది. ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే మహానాడును ఈ సారి ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. సోమవారం పార్టీ స్రాటజీ క మిటీ సమావేశంలో నేతల అభిప్రాయాలు సేకరించిన అధినేత చంద్రబాబు మహానాడును ఈ ఏడాది ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత విజయవాడలోనే మహానాడును నిర్వహించాలని భావించినప్పటికీ, పార్టీ నేతల అభిప్రాయాలు, సూచనలకు అనుగుణంగా వేదికలో మార్పు చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో మహానాడు నిర్వాహణపై మరొసారి చర్చించిన చంద్రబాబు ఒంగోలు వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

గడిచిన రెండేళ్ళు కోవిడ్‌ విజృంభణతో మహానాడు నిర్వాహణ సాధ్యం కాలేదు. అయితే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు నిరుత్సాహపడకూడదన్న సంకల్పంతో ఆన్‌లైన్‌ లో నిర్వహించారు. ప్రతీ ఏటా నిర్వహించే ఈ పార్టీ పండుగ ప్రత్యక్షంగా నిర్వహించకపోవడంతో కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఈసారి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ మహానాడులో పార్టీ కార్యవర్గ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. జాతీయ కార్యవర్గంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక జరుగనున్నది. మే 27,28,29 తేదీలలో మూడు రోజుల పాటు పసుపు పండుగను నిర్వహించనున్నారు. మహానాడు నిర్వాహణకు అవసరమైన ఏర్పాట్లు చేసే అంశంపై త్వరలో జరిగే పొలిట్‌ బ్యూరో సమావేశంలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొననుంది. ఈ సమావేశం అనంతరం మహానాడు నిర్వాహణ పై పూర్తి స్పష్టత రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement