Wednesday, November 6, 2024

Vijayawada | నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేసిన వైసీపీ.. ఎంపీ చిన్ని

  • యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం..
  • త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు..
  • స్టడీ సర్కిల్స్ ని సద్వినియోగం చేసుకోండి…
  • ఎమ్మెల్యే కొలిక్కిపూడి ఆధ్వర్యంలో ఉచిత స్టడీ సర్కిల్ ప్రారంభం..


(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా నిరుద్యోగ యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయావన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను గురువారం ఎంపీ చిన్ని ప్రారంభించారు.

ఈసందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ… నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును అభినందించారు. తిరువూరు నియోజకవర్గంలో సిల్క్ డెవలప్మెంట్ ద్వారా నాలుగు ఐదు సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

యువత, నిరుద్యోగులు ఈ స్టడీ సర్కిల్ ని ఉపయోగించుకొని పోటీ పరీక్షలకు తయారు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు చిట్టాబత్తిన శ్రీనివాసరావు (చిట్టిబాబు) తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement