Thursday, March 28, 2024

వైసీసీ వెంటే బీసీలు.. చంద్రబాబు అంత సీన్ లేదన్న వైసీపీ ఎమ్మెల్యే

నేతన్నలు, బలహీనవర్గాల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. మనసున్న ముఖ్యమంత్రి మూడో విడత నేతన్న నేస్తం అందించారని తెలిపారు. చంద్రబాబు ఏటా 50 వేలు ఇచ్చాడు అని డబ్బకొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏడాదికి 50 నయా పైసలైనా చంద్రబాబు వేశాడా అని నేతన్నలను అడిగితే సమాధానం వస్తుందన్నారు. పాదయాత్రలో చేనేతల కష్టాలను అతిదగ్గరగా చూసి ప్రతిపక్ష నేతగా ఆ రోజే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చెప్పిన మాట చెప్పినట్లు చేసి చూపిన నాయకుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు.  

బీసీలని వాడుకుని వారి నెత్తిన టోపీ పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.  బీసీలు తలెత్తుకునేలా చేసిన నాయకుడు జగన్ అని కొనియాడారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు ప్రత్యేక రాజ్యాంగాన్ని అందిస్తున్నారని తెలిపారు. మంత్రుల్లో బీసీలకు పెద్దపీట వేశారన్న జోగి రమేష్..4 రాజ్యసభ సీట్లలో 2 బీసీలకు ఇచ్చారని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంతా జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో అడుగు వేస్తున్నారని చెప్పారు.

అమరరాజా పరిశ్రమ కాలుష్యం వల్ల కార్మికులు అనాదలుగా మారుతున్నారని అన్నారు. స్థానిక ప్రజలు విలవిలలాడుతుంటే హై కోర్ట్ కూడా స్పందించిందన్నారు. రాష్ట్ర ప్రజల కోసం రుణాలు తీసుకుంటే తప్పా ? అని ప్రశ్నించారు. దేశం ఎక్కడ జరగడం లేదా..?  అని అడిగారు. పేదలకి ఇచ్చే పథకాలను ఇవ్వకూడదని ఇలా మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేసే మంచి పనులకు విపక్ష పార్టీల నాయకులు రాక్షసుల్లా అడ్డు పడుతున్నారని దుయ్యబట్టారు. పసుపు కుంకం కోసం చంద్రబాబు ఇతర శాఖల, కార్పొరేషన్ల నిధులు వాడితే కరెక్ట్…అదే తాము చేస్తే మాత్రం తప్పా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తమ బీసీల దరికీ చేరకూడదని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: హాకీ రజనీపై వరాల జల్లు కురిపించిన జగన్ సర్కార్

Advertisement

తాజా వార్తలు

Advertisement