Tuesday, April 16, 2024

కాపులపై అంబటి వివాదాస్పద వ్యాఖ్యలు.. కామన్ సెన్స్ లేదా?

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. దీంతో అంబటి కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాపు సామాజిక వర్గంపై అంబటి నోరుజారారు. ‘’కాపులు.. తెలివితక్కువవాళ్లు, ఆవేశపరులు, మాంసం ఎక్కువగా తింటారు, మద్యం బాగా తాగుతారు. ఇవన్నీ మిగతా కమ్యూనిటీల్లో ఉన్నా.. కాపుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి’’ అని అంబటి వ్యాఖ్యానించారు. మీరు సర్వే ఏమైనా చేశారా.. అని యాంకర్ అడగ్గా… దీనికి సర్వే అవసరం లేదంటూ బదులిచ్చారు. అంబటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదే ఇంటర్వ్యూలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మాట్లాడుతూ.. ”కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు, ఆయన కొడుకు జనంలో ఉండకుండా హైదరాబాద్‌లో ఉంటారా? ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి బాధ్యత ఉండక్కర్లేదా?” అంటూ ప్రశ్నించారు. మరి జగన్‌ కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా అని యాంకర్ అడిగితే.. ”కరోనా టైమ్‌లో ఆయన ఎందుకు బయటికి రావాలి ? కామన్ సెన్స్‌ లేదా?” అంటూ ఎదరు ప్రశ్నించారు.

అంబటి వ్యాఖ్యాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు. చంద్రబాబు కరోనా టైమ్‌లో ప్రజల్లో తిరగాలి, ముఖ్యమంత్రి అయిన జగన్ మాత్రం ఇంట్లోనే కూర్చుంటాడా.. ఇదెక్కడి లాజిక్ అంబటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement