Friday, April 19, 2024

వకీల్ సాబ్ పండగలా ఉంది: RRR

వకీల్ సాబ్ చిత్రంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ అద్భుతంగా ఉందన్న ఆయన ఈ చిత్రం అభిమానులకు పండగలా ఉందన్నారు. పోలీసులు తప్పుడు కేసులు ఎలా పెడుతున్నారో వకీల్ సాబ్ లో బాగా చూపించారని… అచ్చం నాపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు తప్పుడు కేసులు మోపినట్లేమా వకీల్ సాబ్ కూడా పవన్ లాగే వాదించి, తప్పుడు కేసులు అని నిరూపిస్తారని నమ్ముతున్నా- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇక చాన్నాళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడ్డారు. లాక్ డౌన్ తర్వాత, సినిమా హాళ్లు తెరుచుకున్న తర్వాత థియేటర్లలో మొదటిసారి జోష్ కనిపించింది ఈ వారమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement