Friday, October 4, 2024

AP: ప్రపంచ భారతీయ తత్వవేత్త ఆచార్య సచ్చిదానందమూర్తి : వెంక‌య్య నాయుడు

ఏఎన్యూ క్యాంపస్, (గుంటూరు) సెప్టెంబర్30 (ప్రభ న్యూస్) : సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆప్రో ఏషియన్ ఫిలాసఫీస్ ఆధ్వర్యంలో సోమవారం పద్మ విభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి విజన్ ఆన్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్షన్స్ ఆన్ 21 సెంచరీ ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సును మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ఆచార్య సచ్చిదానందమూర్తి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రాచీన భారతీయ తత్వవేత్తగా ఆచార్య సచ్చిదానందమూర్తి పేరు గాంచారన్నారు. నేటి యువత సచ్చిదానందమూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, న్యూఢిల్లీలో యుపిఎస్సి మాజీ సభ్యులు ఆచార్య కేఎస్.చలం, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఫిలాసఫీ విశ్రాంత ఆచార్యులు ఆచార్య అశోక్ ఓహరా, ఏఎన్యూ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య గంగాధరరావు, గౌరవ అతిథులు ఏఎన్యూ తాత్కాలిక రెక్టార్ ఆచార్య కే.రత్న షీలామణి, తాత్కాలిక రిజిస్టార్ ఆచార్య జి.సింహాచలం సచ్చిదానందమూర్తి సేవలను కొనియాడారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement