Saturday, May 21, 2022

Flash: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం.. బాలింతపై సామూహిక అత్యాచారం

శ్రీ సత్యసాయి జిల్లాలో మరో దారుణం జరిగింది.  బహిర్భూమికి వెళ్లిన ఓ బాలింతపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆపై బండరాయితో మోది దారుణంగా హత్యచేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ముఖం పూర్తిగా ఛిద్రమై ఉండడాన్ని గుర్తించారు. సమీపంలోని బావి వద్ద ఉన్న బండరాళ్లను తెచ్చి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ముందస్తు పథకంలో భాగంగానే గ్రామానికి చెందిన కొందరు ఆమెను ఊరి బయటకు పిలిపించి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement