Tuesday, October 8, 2024

Vijayawada: ఇద్దరు పిల్లలతో సహా కాల్వలో దూకిన మహిళ…

ఆ మహిళకు ఏం ఆపద, కష్టమొచ్చిందో.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెజవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి దగ్గర వండౌడ్ కాల్వలో ఇద్దరు పిల్లలతో సహా కాల్వలోకి దూకింది మహిళ.

ఈ క్రమంలో అక్కడున్న స్థానికులు గమనించి ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే ఆ చిన్నారిని హాస్పటల్‌కు తరలించేలోపే చనిపోయింది. మరోవైపు.. తల్లి కుమారుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మహిళ, మరో చిన్నారి కోసం కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement