Wednesday, April 24, 2024

స్కూటీపై రాంగ్​ రూట్​లో వచ్చింది.. బడ్సు డ్రైవర్​ని చితకబాదింది.. మహిళను అరెస్టు చేసిన పోలీసులు

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడిన కేసులో నందిని (28) అనే మహిళను విజయవాడ పోలీసులు ఇవ్వాల అరెస్టు చేశారు. ఈ సంఘటన నిన్న జరిగింది. ఈ ఘటన జరుగుతుండగా సమీపంలోని వ్యక్తులు తమ మొబైల్ కెమెరాల్లో ఘటన మొత్తాన్ని వీడియో తీశారు. ఏపీ11 జెడ్ 7046 నెంబర్ గల బస్సు నడుపుతున్న డ్రైవర్ ముసలయ్య (42)ని స్కూటర్ నడుపుతున్న మహిళ బస్సు లోపలికి ఎక్కి చితక్కొట్టింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిని రోడ్డుపై రాంగ్ సైడ్ డ్రైవ్ చేసింది. డ్రైవరు బస్సును తరలించడానికి వీలుగా కొంత సమయం వేచి ఉండమని కోరాడు. దీంతో తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆ మహిళ బస్సులోకి ఎక్కి  డ్రైవర్‌పై దాడి చేసింది. బస్సు డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేశారు.

అసలేం జరిగిందటే..

స్కూటి పై రావడమే రాంగ్‌ రూట్‌.. ఇంతలో ఒక బస్సు డ్రైవర్‌ హారన్‌ మ్రోగించడంతో ఆ మహిళకు కోపమొచ్చింది. ఇక అంతే స్కూటీని బస్సుకు అడ్డంగా నిలిపి వీరంగం సృష్టించింది. ఒక అడుగు ముందుకు వేసి బస్సు ఎక్కి డ్రైవర్‌ ని కాలుతో తన్నింది. అంతే కాకుండా బూతులు తిట్టి హంగామా సృష్టించింది. నిన్న (బుదవారం) మాద్యాహ్నం 3 గంటల సమయంలో కాళేశ్వరరావు మార్కెట్‌ నుంచి ఆటోనగర్‌ వెళుతున్న 5 వ నెంబర్‌ బస్‌ ఆంద్రా హాస్పిటల్‌ సమీపంలో రాంగ్‌ రూట్‌ లో టూవీలర్‌ పై బస్సుకు ఎదురుగా కుంభ నందిని అనే మహిళ వస్తుండడంతో గమనించిన ఆర్ టీ సి బస్‌ డ్రైవర్‌ హారన్‌ కొట్టాడు. దీంతో కోపోద్రీక్తురాలైన సదరు మహిళ బస్‌ ఎక్కి డ్రైవర్‌ ను కాలితో తన్నుతూ వీరంగం సృష్టించింది.

- Advertisement -

డ్రైవర్‌ పై దాడి చేస్తున్న మహిళ ని ఆగమని మరో మహిళ వారిస్తున్నా అదేమీ లెక్కచేయకుండా తనకేదో డ్యామేజ్‌ అయిపోయిందని దుర్బాషలాడింది. గవర్నమెంట్‌ ఉద్యోగి అని విలువ లేకుండా తన తండ్రి వయసులో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను కాళ్లతో తన్నడం సరైన చర్య కాదు అని బస్సులో ఉన్న వారు పేర్కొంటు న్నా వినకుండా రెచ్చిపోయింది. ఘటనపై బస్సు డ్రైవర్‌ ముసలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు మహిళను సూర్యరావు పేట పోలీసులు అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement