Thursday, April 25, 2024

ఇళ్ల పంపిణీ ఎప్పుడో ? మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూపులు..

గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల గృహాల పంపిణీ కోసం లబ్దిదారులు ఇంకేనాళ్లు అంటూ ఎదురుచూపులు చూడాల్సి ఉంది. గతంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వారు టిడ్కో గృహాలను వెంటనే లబ్దిదారులకు అందచేయాలని కోరిన సమయంలో పండుగల అనంతరం పంపిణీకి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. పండుగలు ముగియడంతో ఒక్కసారిగా గృహాలు మంజూరైన లబ్దిదారుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని బైపాస్‌ రోడ్డు వద్ద గత 4 సంవత్సరాల క్రింత పేదల కోసం నిర్మించిన బహుళ అంతస్తులు ఇప్పటికి నిరుపయోగంగానే ఉన్నాయి. గతంలో రెండు దఫాలు కొవిడ్‌ వచ్చిన సమయంలో క్వారెం-టైన్‌ కేంద్రంగా వాటిని అధికారులు వినియోగించుకున్నారు. అయితే గృహాలు మంజూరైన లబ్దిదారులకు మాత్రం ఇంత వరకు వాటిని అందించేందుకు చేస్తున్న పనులేమి ముందుకు సాగకపోవడంతో ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో వేసిన రంగులను మార్చి ప్రస్తుతం ప్రభుత్వం చేతులు దులుపుకున్నారని పలు పార్టీల నాయకులు అంటు-న్నారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు వివిధ సౌకర్యాలను సైతం ఇప్పటికి కల్పించలేదనే చెప్పాలి. గతంలో ఈ గృహాలను లబ్దిదారులకు లాటరీ విధానంలో కేటాయించగా ఈ ప్రభుత్వం కూడా మరో మారు లబ్దిదారులకు ఇళ్లను కేటాయించారు. ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు వారికి ఇళ్లు కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అందరికి ఇళ్ల పథకం ద్వారా 1028 ఇళ్లు మంజూరు చేశారు. వీటి కోసం కొందరు లబ్దిదారులు కొంత మొత్తం నగదు చెల్లించి బ్యాంకు రుణాలను సైతం తీసుకున్న వారు ఉన్నారు. కానీ ఇంత వరకు వారి చేతికి గృహాలకు సంబంధించిన తాళాలు అందించకపోవడంతో ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలో అని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధునాతన -టె-క్నాలజీతో నిర్మించి సుందరంగా దర్శనమిస్తున్న ఈ గృహాలు పేదలకు గూడు వసతి కల్పించే పరిస్థితి లేకపోవడం పలు శోచనీయం.

క్వారెంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు..
ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌ రోగులను క్వారెం-టైన్‌ లో ఉంచేందుకు ఈ బహుళ అంతస్తుల గృహాల్లో క్వారెం-టైన్‌ సెంటర్‌ పెట్టి ఏర్పాట్లు- చేశారు. సుమారు 620 బెడ్లను రోగుల కోసం సిద్దం చేసి మొదటి, రెండవ వేవ్‌ లలో బాధితులను అక్కడ ఉంచి వారికి అన్ని సదుపాయాలు కల్పించి క్వారెం-టైన్‌ సెంటర్‌ గా వినియోగించారు. ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక తమకు ఆ గృహాలు లభిస్తాయన్న ఆశతో రోజురోజుకు సన్నగిల్లుతుందని ప్రజలు అంటు-న్నారు. ఏదేమైనా ఇప్పటి వరకు టిడ్కో గృహాలు నిరుపయోగంగా ఉండగా అక్కడ నివాసాలు ప్రశ్నార్థకమేనని పలువురు భావిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన గృహాలను ఎప్పటి-కై-నా వినియోగంలోకి వస్తాయా లేదా అని మంజూరైన లబ్దిదారులు అంటు-న్నారు. ఏళ్లు గడిచే కొద్ది గతంలో వేసిన రోడ్లు కూడా దెబ్బతింటు-ండడంతో మళ్లీ ఏర్పాట్ల పేరుతో మరింత కాలయాపన చేసే దిశగా ఆలోచన చేస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఆత్మకూరు పట్టణంలో సర్వాంగ సుందరంగా ఉన్న ఈ గృహాలను పేదలకు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతున్నదే అందరు చెప్పే సత్యం.

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ..
ఒక్క ఆత్మకూరులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడి ఉంది. ఆత్మకూరుతో పాటు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం వద్ద , నెల్లూరు రూరల్‌ అల్లిdపురం గ్రామంలో , గూడూరు, కావలి , నాయుడుపేట , తదితర పట్టణాల్లో టిడ్కో గృహాలను నిర్మించి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారి నివారణలో భాగంగా ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లకు తాత్కాలికంగా వాడుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఆయా గృహాలకు సంబంధించి సరైన కాపలాదారులు లేకపోతుండడంతో వస్తువులు చోరీకి గురవుతున్నాయి. పంపిణీ వాయిదా వెనుక కోర్టు కేసులతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పార్టీలు చూడవద్దని , తమ ప్రజా ప్రతినిధులకు , అధికారులకు ఇప్పటికే స్పష్టం చేసి ఉండడంతో ప్రతి ప్రభుత్వ పథకం పార్టీ రహితంగానే పారదర్శకంగా అమలవుతోంది. అదే విధంగా పారదర్శక రీతిలో గత ప్రభుత్వం కేటాయించిందన్న ఒకే ఒక్క సాకు చూపి వాయిదా వేయకుండా తమకు గృహాలు అందజేస్తే జీవితాంతం జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధిత లబ్ధిదారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement