Thursday, April 25, 2024

Water Matters: మిగులు జలాలపై పూర్తి హక్కు ఏపీదే.. వాటా జలాల కింద జమకట్టొద్దు..

అమరావతి, ఆంధ్రప్రభ: కృష్ణా నది మిగులు జలాలపై సంపూర్ణ హక్కులు ఆ బేసిన్‌ (నదీ పరీవాహక ప్రాంతం)లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌వేనని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్యారీ ఓవర్‌ జలాల విషయంలో కేంద్ర జల శక్తి శాఖకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సెప్టెంబర్‌ 17, 2020న ఇచ్చిన నివేదికలో రాష్ట్ర విభజనతో కృష్ణా బేసిన్‌లో దిగువ రాష్ట్రం ఏపీనేనని స్పష్టంచేసిన ఆంశాన్ని వారు ప్రస్తావించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల గేట్లు- ఎత్తివేసినప్పుడు వరద జలాలు సముద్రంలో కలుస్తున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో ఏరాష్ట్రం నీటిని వినియోగించుకున్నా వాటిని లెక్కలోకి తీసుకోకూడదని ఏపీ చేసిన ప్రతిపాదన సహేతుకమైనదేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నీటితో బంజరు భూములను సస్యశ్యామలం చేసుకునే అవకాశం ఇరు రాష్ట్రాలకు ఉంటుందంటూ వారు చెబుతున్నారు. ఈ అంశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

లెక్కలోకి తీసుకోకపోవడమే ఉభయతారకం
కృష్ణా మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీకే ఉంటు-ందని కేడబ్ల్యూడీటీ- (కృష్ణా జల వివాదాల పరిష్కార ఋజ్యునల్‌)-1 తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీ-ఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది. అందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీ-ఎంసీలను పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు- చేసింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పును ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ప్రస్తుతం కేడబ్ల్యూడీబీ-1 తీర్పే అమల్లో ఉంటు-ంది. ఈనేపథ్యంలో మిగులు జలాలను ఇరు రాష్ట్రాలు ఎంత వాడుకున్నా వాటిని నికర జలాల కింద లెక్కించకూడదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసిందని… రెండు రాష్ట్రాలకు ఉభయతారకుగా ఉండేతా కృష్ణా బోర్డుకు ప్రతిపాదన చేసిందని వారు ప్రశంసిస్తున్నారు. కానీ.. దీన్ని తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకిస్తుండటాన్ని తప్పుపడుతున్నారు.

798 టీఎంసీలు కడలిపాలు
2019-20 నీటి సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 7,18,207 టీ-ఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయి. ఈకాలంలో సుమారు 4 టీ-ఎంసీలను ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం వాటిని వినియోగించుకోకపోయుంటే ఈనీరు కూడా కడలిలో కలిసేది. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ సముద్రంలో వరద జలాలు కలుస్తున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నీటిని వినియోగించుకున్నా వాటిని వాటా జలాల కింద లెక్కించకూడదని అక్టోబర్‌ 8, 2019న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలో దిశానిర్దేశం చేయాలంటూ కేంద్ర జల్‌ శక్తి శాఖను కృష్ణా బోరు కోరింది. ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ ఐపీవో సీఈ సీహెచ్‌ విజయ్‌ శరణ్‌ నేతృత్వంలో అత్యున్నత సాంకేతిక కమిటీ-ని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement