Tuesday, May 18, 2021

జ‌గ‌న్ రాముడో, రావ‌ణుడో తేలే వ‌ర‌కు ఎపిలో కాలు పెట్ట‌నుః రఘ‌రామ‌కృష్ణం రాజు..

న్యూఢిల్లీ /న‌ర్సాపురం : ఏపీ సీఎం జగన్ రాముడో.. రావణుడో తేలేవరకు ఏపీలో కాలుపెట్టనని న‌ర్సాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తానోక మహా యజ్ఞం చేపట్టానని, అది సర్పయాగమని.. అది పూర్తయ్యే వరకు న‌ర్సాపురంలో కాలుపెట్ట‌న‌ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకన్న సంక్షేమ పథకాలకు ఇస్తున్న నిధులు తక్కువగా ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రూ. 1500 వందల కోట్ల కోసం ఇప్పుడు విశాఖలో భూములు అమ్మాలని చూస్తున్నారని.. త్వరలో రాష్ట్రాన్ని అమ్మకానికి పెడతారని వ్యాఖ్యానించారు. ‘‘తిరుపతిలో ఓటుకు రూ.2వేలు ఇస్తున్నారట.. ప్రజల భవిష్యత్తు వారి చేతిలో ఉంది.. నేను కనపడటం లేదని పోస్టర్లు వేస్తారట.. వైసీపీని కాపాడుకునే ప్రయత్నంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేశా.. నేను ముఖ్యమంత్రి రాముడని అనుకుంటున్నా.. రావణుడని కొందరు అనుకుంటున్నారు.. జగన్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఉంటే బావుంటుంది.. తిరుపతిలో వైసీపీ నెగ్గడం ఖాయం.. రెండు లక్షల మెజారిటీ వస్తుందని’’ పేర్కొన్నారు ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు..

Advertisement

తాజా వార్తలు

Prabha News