Friday, April 19, 2024

పోల‌వ‌రం గేట్ల ట్ర‌య‌ల్ ర‌న్ విజ‌య‌వంతం..

పోలవరం ప్రాజెక్టు నిర్మా ణంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. ప్రాజెక్టు గేట్ల ట్రయ ల్‌ రన్‌ శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లను గాను 34 గేట్ల అమరిక పనులన్నీ సంపూర్ణంగా పూర్తి కావటంతో గేట్ల రన్‌ నిర్వ హించారు. రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన ఇంజనీ రింగ్‌ నిపుణులతో పాటు- ప్రాజెక్టు నిర్మాణ బాధ్య తలు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిపుణుల పర్య వేక్షణలో అత్యంత కట్టు-దిట్టంగా, పకడ్బందీగా గేట్ల ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ట్రయల్‌రన్‌లో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్దేశిత సయమం, నియమాలకు అనుగుణంగా ట్రయల్‌ రన్‌ విజయవంతమైనట్టు- ఇంజనీరింగ్‌ నిపుణులు వెల్లడించారు. దీంతో ప్రాజెక్టులో అత్యంత కీలక అంకంగా భావిస్తు న్న గేట్ల అమరిక నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు- భావిస్తు న్నారు. హైడ్రాలిక్‌ సిలిండర్‌ సాయంతో గేటును నిమిషానికి 1.5మీటర్లు ఎత్తే అవకాశం ఉంటుంది. 44,43వ గేట్లను పైకి ఎత్తి మళ్లీ విజయవంతంగా కిందకు దించగలి గారు. తొలిగా 44వ గేటు-ను 6 మీటర్ల మేర పైకి ఎత్తి ఆ తరువాత 3 మీటర్ల మేర కిందకు దించారు. 2400 టన్నుల వత్తిడిని సైతం తట్టుకునేలా గేట్లను డిజైన్‌ చేసి నిర్మించారు. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లను అమర్చాల్సి ఉండగా ఇప్పటివరకు 34 గేట్లను అమర్చారు. ఒక గేటుకు రెండు హైడ్రాలిక్‌ సిలిండర్ల చొప్పున మొత్తం 96 సిలిండర్లను బిగించాల్సి ఉంది. ఇప్పటి వరకు 56 సిలిండర్ల ను బిగించారు. 24 పవర్‌ ప్యాక్‌ లకు గాను 5 పవర్‌ ప్యాక్‌ లను పూర్తి చేశారు. ఒక్కో పవర్‌ ప్యాక్‌ సాయంతో రెండు గేట్ల ను ఎత్తవచ్చని ఇంజనీరింగ్‌ నిపుణు లు చెబుతున్నారు. ప్రాజెక్టులో 10 రివర్‌ స్లూయిజ్‌ గేట్లకు గాను 10 గేట్ల అమరికను ఇప్పటివరకు పూర్తి చేశారు. మూడు రివర్‌ స్లూయిజ్‌ గేట్లకు సిలిండర్లను అమర్చే ప్రక్రియ కూడా పూర్తయింది. గేట్ల ట్రయల్‌ రన్‌ పనులను పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌ బాబు, ఎస్‌.ఈ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్‌ సంస్ద జిఎంలు సతీష్‌ బాబు, మిశ్రా, బెకెం ఇంజనీరింగ్‌ సంస్ద ప్రాజెక్ట్‌ ఇంచార్జి ఎ.నాగేంద్ర తదితరులు పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement